అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఒక్కటి... అంటే చంద్రబాబుకు మమ'కారం'!!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు విజయకేతనం ఎగరవేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును ఓడించాలనే గట్టి పట్టుదలతో ప్రభుత్వం పావులు కదుపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గాన్ని చిత్తూరు జిల్లాలో ఓడించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఆయన తాజాగా చంద్రగిరిపై దృష్టిసారించారు.

పార్టీని బలోపేతం చేయాలని..

పార్టీని బలోపేతం చేయాలని..


1978లో తాను మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించింది అక్కడే కావడంతోపాటు సొంత జిల్లాలోని నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో చంద్రబాబు కూడా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి కుప్పం నియోజకవర్గానికి మారారు. తన సొంత జిల్లా చిత్తూరులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి, టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. సొంత జిల్లా గురించి పట్టించుకోరంటూ విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఈసారి ఉన్నారు.

పెద్దిరెడ్డి వర్గాన్ని ఓడించేందుకు..

పెద్దిరెడ్డి వర్గాన్ని ఓడించేందుకు..

తన సొంత గ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుండటంతోపాటు గతంలో ఇక్కడి జడ్పీ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. 1983, 1985, 1994లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది. మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్, గత రెండు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంగా ఉన్నవారందరినీ ఓడించేందుకు పావులు కదుపుతున్న చంద్రబాబు చంద్రగిరిపై దృష్టి పెట్టారు.

ఎక్కడ విన్నా చెవిరెడ్డి పేరే..

ఎక్కడ విన్నా చెవిరెడ్డి పేరే..


చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలకతీతంగా సంక్రాంతిని పురస్కరించుకొని ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికుల‌కు ఖ‌రీదైన బ‌ట్ట‌లు పెట్టి స్వీట్లు, హాట్లు పంచారు. క‌రోనాస‌మ‌యంలో పేదా సాదా అనే తేడా లేకుండా ప్ర‌తి ఇంటికీ శానిటైజ‌ర్లు, మాస్కులు నెల‌కు రెండు సార్లు పంపిణీ చేశారు. ఆనంద‌య్య క‌రోనా మందును ఇంటింటికీ స్వ‌యంగా అందించేలా చర్యలు తీసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చెవిరెడ్డి పేరే వినిపిస్తోంది. ఈసారి చెవిరెడ్డిని ఓడించడానికి గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు విజయం సాధించారు. చంద్రగిరిని గెలుచుకోవడానికి చంద్రబాబునాయుడు ఇంకా ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారో వేచిచూడాల్సి ఉంది.

English summary
Chandrababu Chandrababu is moving his steps to defeat Minister Peddireddy Ramachandra Reddy's faction in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X