Charithra Chandran:ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన డస్కీ బ్యూటీ-ఎవరీమె..?

లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగిన ఆస్కార్ 2026 వేడుకల్లో ఒక అద్భుతం జరిగింది. హాలీవుడ్ అగ్ర తారలు, ప్రపంచ సుందరీమణులు నడుస్తున్న ఆ రెడ్ కార్పెట్ మీద అందరి కళ్లు ఒక్కసారిగా ఒకే ఒక్కరిపై నిలిచిపోయాయి. ఆ మెరుపు తీగ మరెవరో కాదు.. మన 'తమిళ'అమ్మాయి చరిత్రా చంద్రన్. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్త సెన్సేషన్ 'వన్ పీస్'(One Piece)సిరీస్‌లో తన నటనతో ప్రపంచాన్ని ఊపేసిన చరిత్రా..ఇప్పుడు ఆస్కార్ వేదికపై తన రాయల్ ఎంట్రీతో ఇంటర్నేషనల్ మీడియా హెడ్ లైన్స్‌లో నిలిచారు.ఆస్కార్ వేదిక అంటే హాలీవుడ్ కలల శిఖరం. అక్కడ అందరూ వెస్ట్రన్ గ్లామర్‌తో మెరిసిపోతుంటే,చరిత్రా చంద్రన్ మాత్రం తన విలక్షణమైన శైలితో అందరినీ ఆశ్చర్యపరిచారు.

బాటిల్ గ్రీన్ గౌన్‌లో 'బెస్ట్ డ్రెస్డ్'క్వీన్

అచ్చమైన బాటిల్ గ్రీన్ కలర్ గౌన్‌లో,చిరునవ్వు చిందిస్తూ ఆమె రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే లాస్ ఏంజిల్స్ నగరం ఒక్క క్షణం స్తంభించిపోయింది.ఆకట్టుకునే హెయిర్ స్టైల్,కళ్ళలో ఆత్మవిశ్వాసం చూస్తుంటే 'తమిళ అమ్మాయి సత్తా ఇదేరా'అనిపించేలా ఉంది.ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్లు చరిత్రాను 'బెస్ట్ డ్రెస్డ్'జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టడం విశేషం.

charithra-chandran-stuns-at-98th-academy-awards-red-carpet-one-piece-star-makes-global-headlines

చరిత్రా కేవలం అందంతోనే కాదు,తన సామాజిక స్పృహతో కూడా అందరి మనసు గెలుచుకున్నారు.ప్రపంచ శాంతిని కోరుతూ ఆమె తన డ్రెస్ మీద 'Artists4Ceasefire'అనే పిన్ ధరించారు."కళ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు,అదొక బాధ్యత"అని మౌనంగానే చాటిచెప్పారు.

తమిళ గడ్డపై మూలాలు.. ఆక్స్‌ఫర్డ్ చదువు

చరిత్రా చంద్రన్ ప్రయాణం ఒక సినిమా కథలా ఉంటుంది.స్కాట్లాండ్‌లోని ఒక తమిళ కుటుంబంలో ఆమె జన్మించారు. చరిత్రా రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన తండ్రితో కలిసి తమిళనాడుకు వచ్చేసింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో తన తాతయ్య, అమ్మమ్మల దగ్గర గడిపారు. ఆ తమిళ సంస్కృతి, భాషా బంధం ఆమెలో బలంగా నాటుకుపోయాయి.ఆ తర్వాత లండన్ వెళ్లి ప్రతిష్టాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ,పాలిటిక్స్ ,ఎకనామిక్స్ చదివారు.ఒక మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించినా,నటనపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

'బ్రిడ్జర్‌టన్' నుండి 'వన్ పీస్' వరకు..
నెట్ ఫ్లిక్స్ హిట్ సిరీస్ 'బ్రిడ్జర్‌టన్' (Bridgerton) సెకండ్ సీజన్‌లో ఎడ్వినా శర్మగా అందరి దృష్టిని ఆకర్షించిన చరిత్రా, ఇప్పుడు 'వన్ పీస్' అనీమే అడాప్టేషన్‌లో నీలిరంగు జుట్టు గల రాజకుమారి 'వివి' (మిస్ వెడ్నెస్డే) పాత్రలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా, తన అద్భుతమైన నటనతో వాటన్నింటినీ తుడిచిపెట్టేశారు."నేను ఎక్కడికి వెళ్లినా నా మూలాలు తమిళనాడులోనే ఉంటాయి. ఆ ప్రత్యేకత ఎప్పటికీ నాతోనే ఉంటుంది" అని ఆమె గర్వంగా చెబుతారు.

హాలీవుడ్ వంటి భారీ ప్రపంచంలో ఒక దక్షిణాసియా మహిళ, అందునా ఒక తమిళ అమ్మాయి అగ్రశ్రేణి పాత్రలను పోషిస్తూ ఆస్కార్ వేదికపై లైమ్‌లైట్‌ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. "మా ఊరి అమ్మాయి ప్రపంచాన్ని ఏలుతోంది" అని నేడు ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటున్నారు. చరిత్రా చంద్రన్ సాధించిన ఈ విజయం రాబోయే అనేక మంది భారతీయ ప్రతిభావంతులకు ఒక మార్గం చూపుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+