తమిళనాడు, కేరళ పోలింగ్ తేదీలు వెల్లడి

దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ షెడ్యూల్ జారీ చేయడానికి ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించింది. తేదీల ప్రకటనతో పాటు ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో కొత్త విధాన ప్రకటనలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ఆర్థికపరమైన వరాల గురించి వెల్లడించడానికి వీలుండదు.

Election Commission Announces Assembly Election Dates for Tamil Nadu on April 23 and Keralam April 9

కాగా ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం కలిపి మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17.4 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 2.19 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయనుంది. అలాగే- 25 లక్షల మందికి పైగా ఎన్నికల సిబ్బందిని విధి నిర్వహణలో మోహరింపజేయనుంది. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+