నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమాలు ఇవే..!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఓటీటీల హవా పెరిగిపోయింది. క్రమంగా వీటికి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటం మానేశారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ వేదికల్లో మూవీస్ చూస్తున్నారు. ఇక భారత్ లో అత్యధిక శాతం మంది ఉపయోగించే ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ ఒకటి. నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన వెబ్ సిరీస్, సరికొత్త సినిమాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలు చూస్తే..
తొలి స్థానంలో RRR ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాప్ ప్లేస్ లో ఉంది. ఈ మూవీకి సంబంధించిన హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లోని మూవీ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. ఫలితంగా ఈ చిత్రానికి 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడానికి కారణం కూడా ఈ రీచ్ వల్లే అని చెప్పొచ్చు.
ఇక రెండో స్థానంలో లక్కీ భాస్కర్ ఉంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో కంటే నెట్ ఫ్లిక్స్ లోనే భారీ విజయాన్ని అందుకుంది. 2024లో విడుదలైన ఈ సినిమాకు ఇప్పటి వరకు దాదాపుగా 29.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మూడో స్థానంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో భారీ విజయం నమోదు చేసింది. ఈ చిత్రానికి 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నాలుగో ప్లేస్ లో పుష్ప 2 ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 20.2 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కాయి.

ఇక ఐదో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, ఆరో ప్లేస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్, ఏడో స్థానంలో దేవర, ఎనిమిదో స్థానంలో నాని హీరోగా నటించిన హిట్ 3, తొమ్మిదో స్థానంలో సరిపోదా శనివారం, పదో స్థానంలో ప్రభాస్ కల్కి 2898 AD మూవీ ఉంది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications