ఏపీ బీజేపీలో త్వరలో మార్పులు .. సోము వీర్రాజు ఉద్వాసన ? ఏపీ బీజేపీ చీఫ్ రేస్ లో మళ్ళీ కన్నా !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయా ? ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు పనితీరుపై అధిష్టానం గుర్రుగా ఉందా ? సోము వీర్రాజు పార్టీని బలోపేతం చేయడంలో ఫెయిల్ అయ్యారా ? రాష్ట్ర ఇంచార్జి ఇచ్చిన నివేదికతో రాష్ట్రంలో పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు కోసం అధిష్టానం దృష్టి పెట్టిందా ?అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పనితీరుపై హైకమాండ్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచాలని గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజుకు పట్టం కట్టింది అధిష్టానం. సోము వీర్రాజు ఏపీ బీజేపీని బలోపేతం చేస్తారని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తారని, పార్టీని క్షేత్రస్థాయిలోకి వెళ్లేలా కృషి చేస్తారని బలంగా నమ్మిన అధిష్టానానికి సోము పనితీరు అసంతృప్తిని మిగిల్చిందని సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై బలంగా పోరాడలేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సోము వీర్రాజు సరిగా కృషి చేయకపోవడం, ఏపీలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలా పేలవమైన పనితీరును ప్రదర్శించడం, ఇక రాష్ట్రంలో జరిగిన తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక తో సహా, అన్ని ఎన్నికల్లోనూ బిజెపి చావుదెబ్బ తినడం వంటి కారణాలు సోము వీర్రాజు స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు కారణమయ్యాయని సమాచారం.

తెలంగాణలో బలోపేతం అవుతున్న బీజేపీ .. ఆంధ్రా పై స్పెషల్ ఫోకస్ చేసిన అధిష్టానం
తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కు పట్టం కట్టిన తరువాత పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లడం, తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతున్న తీరు, ఏపీపై అధిష్టానం ప్రధానంగా ఫోకస్ పెట్టేలా చేసింది. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా దూకుడుగా ముందుకు తీసుకు వెళ్ళగల నేత కోసం అధిష్టానం కసరత్తు మొదలు పెట్టిందని సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుని వెంటనే తొలగించాలని అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం గతంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరో రెండు మూడు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పరిశీలిస్తున్న పేర్లలో అందరి కంటే సమర్ధుడు కన్నా లక్ష్మీనారాయణ అని అభిప్రాయం అధిష్టానం వ్యక్తం చేస్తుందని సమాచారం.

సోము వీర్రాజుకు ఉద్వాసన? కన్నాకు మళ్ళీ చాన్స్ .. పార్టీ శ్రేణుల్లో చర్చ
ఈ క్రమంలో త్వరలోనే సోము వీర్రాజు ఉద్వాసన పలికి ,కన్నా లక్ష్మీనారాయణను మళ్లీ ఏపీ బీజేపీ చీఫ్ గా పట్టం కట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో రెండేళ్లపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగాకన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించిన సమయంలో బిజెపి ఉనికిని కాపాడటంలో ఆయన కొంతమేర సఫలీకృతులయ్యారని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే మరోమారు కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుంది. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున చేసిన పోరాటమేమీ కనిపించలేదు. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ కనిపించలేదని సమాచారం.

సోము తీరు నచ్చని అధిష్టానం , బీసీ సీఎం ప్రకటనతో మరింత మైనస్
అంతేకాదు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటన చేసి పెద్ద దుమారం రేపారు. ఆపై అలాంటిదేమీ లేదని సోము వవీర్రాజు పరువు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నిక ఆయన పనితీరుకు అద్దం పట్టింది. ఈ క్రమంలోనే సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తే పార్టీ మరింత బలహీనపడుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఏడాది క్రితం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో బిజెపి జనసేన తో జట్టు కట్టి ముందుకు సాగినా పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా తీసుకురాలేకపోయారు. జనసేన తో పొత్తు పెట్టుకున్నా రెండు పార్టీలు కలిసి సాగుతున్న పరిస్థితి కూడా లేదు. ఈ పరిణామాలు అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం హస్తిన చుట్టూ తిరుగుతున్న సోము వీర్రాజు
మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే లోపు దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం కావాలని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న బీజేపీ అధిష్టానం ఏపీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం . ఈ క్రమంలోనే ఏపీ అధ్యక్షుడు మార్పుపై అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టకుండా సోము వీర్రాజు ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం హస్తిన చుట్టూ తిరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ని కలవడానికి తెగ ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనను కలవడానికి సమయం ఇవ్వలేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

ఏపీ బీజేపీ చీఫ్ రేసులో కన్నా తో పాటు రాయలసీమ నేత .. ఎవరికి పట్టం కడతారో ?
పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర ఇన్చార్జి శివ ప్రకాష్ ను తరచూ ఏపీ పంపించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుంది. ఈ క్రమంలో సోము వీర్రాజు పనితీరు పైనే అధిష్టానం తీవ్ర అసహనంతో ఉంది. ఏది ఏమైనా త్వరలో ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్వాసన పలికి, ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా పట్టం కడతారని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మరి అధిష్టానం సోము వీర్రాజు స్థానంలో ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications