వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విడాకులు తీసుకున్నవారే టార్గెట్.. మొన్న నిత్య పెళ్ళికూతురు; తాజాగా నిత్య పెళ్ళికొడుకు; బీ అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పెళ్ళిళ్ళ పేరుతో మోసం చేసే వారి జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేస్తూ పెళ్లి పేరుతో నయవంచన కు తెర తీస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసి ఒక 54 సంవత్సరాల మహిళ శరణ్య ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకోగా, ఇక తాజాగా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్న నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు కూడా విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

విడాకులు తీసుకున్న వారే టార్గెట్ .. ప్రేమ, పెళ్లి పేరుతో 'నయా' వంచన

విడాకులు తీసుకున్న వారే టార్గెట్ .. ప్రేమ, పెళ్లి పేరుతో 'నయా' వంచన


సమాజంలో వివిధ కారణాలతో, కుటుంబ కలహాలతో భర్తతో భార్య, భార్యతో భర్త కు సయోధ్య లేని చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అటువంటి వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్న క్రమంలో వారు వివాహం కోసం మ్యాట్రిమోనీ లను ఆశ్రయిస్తున్నారు. ఇక విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకుంటున్న కొందరు వారి పరిస్థితులను ఆసరాగా తీసుకుని, నిదానంగా ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారు. ఆపై వారిని పెళ్లి చేసుకుని, అందినకాడికి దండుకుని, వారిని మోసం చేసి వారితో తెగదెంపులు చేసుకుంటున్నారు. మళ్లీ మ్యాట్రిమోనీ ల ద్వారా విడాకులు తీసుకున్న మరొకరిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఇటువంటి ఘటనలు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బడిముబ్బడిగా సాగుతున్నాయి.

 54 ఏళ్ళ బామ్మ, తాజాగా నిత్య పెళ్ళికొడుకు మోసం చేసింది విడాకులు తీసుకున్న వారినే

54 ఏళ్ళ బామ్మ, తాజాగా నిత్య పెళ్ళికొడుకు మోసం చేసింది విడాకులు తీసుకున్న వారినే


మొన్నటికి మొన్న 54 సంవత్సరాలు శరణ్య మేకప్ వేసుకుని ముప్పై నాలుగేళ్ల పాటు మహిళలా రెడీ అయ్యి తిరువళ్ళూరు కు చెందిన గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతని ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసిన శరణ్య అడ్డంగా దొరికిపోయింది. అయితే గణేష్ గతంలో ఒక మహిళను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న వ్యక్తి కావడంతో, ఆమె అతడిని సులభంగా బోల్తా కొట్టించింది. ఇక ఇదే క్రమంలో తాజాగా మరో నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేస్తూ సాగింది.

విడాకులు తీసుకున్న యువతుల లక్ష్యంగా ఏకంగా 11 పెళ్ళిళ్ళు చేసుకున్న ఘనుడు

విడాకులు తీసుకున్న యువతుల లక్ష్యంగా ఏకంగా 11 పెళ్ళిళ్ళు చేసుకున్న ఘనుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకుంటున్న నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 11మంది మహిళలు తమను కేటుగాడు ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లయిన కొన్ని నెలలకే విలువైన వస్తువులతో ఉడాయించాడని ఆరోపించారు. తాను ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అని, లక్షల్లో సంపాదిస్తున్నానని చెప్పి మ్యాట్రిమోనియల్ సైట్‌ల ద్వారా విడాకులు తీసుకున్న యువతులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని వారు పేర్కొన్నారు.

డైవర్స్ తీసుకున్న వారు పెళ్లి విషయంలో అలెర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు

డైవర్స్ తీసుకున్న వారు పెళ్లి విషయంలో అలెర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు


ఇక ఇటువంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే, వాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే పెళ్లి విషయంలో ఆ ఆలోచన చేయాలని చెబుతున్నారు. ప్రేమ పేరుతో చెప్పే మాయమాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో విడాకులు తీసుకున్న వారు ఇటువంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విడాకులు తీసుకున్న వారి పరిస్థితులను ఆసరాగా చేసుకుని, పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న వారు పెరిగిపోయాయని చెబుతున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

English summary
Frauds in the name of marriage have increased as the target is the divorced. previously eternal bride; In the latest a eternal groom affair, they cheated only divorcees, so the police are saying that divorcees be careful about marriages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X