చంద్రబాబు పై ప్రశంసలు కురిపించిన చిరంజీవి..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు తమ భవిష్యత్ లో మరింత బలోపేతం అయ్యేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. రాజకీయంగా నూ నందమూరి - మెగా కుటుంబాలు కీలకంగా మారుతున్నాయి. ఇటు బీజేపీ సైతం ఏపీలో తాజా పరిణామాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తోంది. కొంత కాలం గా ఏపీలో చిరంజీవి కేంద్రంగా రాజకీయ చర్చ సాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
చంద్రబాబు పై
ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ధీరోదాత్తుడ ని అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన 'మైండ్ సెట్ షిప్ట్' పుస్తకావిష్కరణ సభకు హాజరైన చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్ సెట్ తో ముందుకెళ్లాలని. తాను అక్కడే విజయం సాధించానని చిరంజీవి పేర్కొన్నారు. అత్యున్నత స్థానానికి వెళ్లినా ప్రవర్తన సరిగా లేకుంటే గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. అలిపిరి సంఘటనతో చంద్రబాబు కిందపడి లేచారని... అంతటి పరిస్థితిలోనూ ఎక్కడా చెక్కు చెదరలేదని వ్యాఖ్యానించారు.

ఊహించని పరిస్థితులు
చంద్రబాబు మానసిక స్థైర్యంతో ఉన్నారని.. అంతటి ధీరోదాత్తత ఆయనలో తాను చూశానని వివరించారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు అని చిరంజీవి పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారని ప్రశంసించా రని విశ్లేషించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచిన చంద్రబాబు... వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిం దన్నారు. జీవితం పూలపాన్పు కాదని... ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయని వివరించారు. అయినా.. ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయన్నారు.
ఐటి నుంచి ఏఐ వరకు.. చంద్రబాబు గారు is a "Pioneer".. ఓ మహానాయకుడు..#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/lqoCQPwCIH
— Telugu Desam Party (@JaiTDP) April 24, 2025
ఎన్నో అవరోధాలు
ఎన్ని అవరోధాలు వచ్చినా చిత్తశుద్ది ముఖ్యమని చిరంజీవి వివరించారు. డిస్ట్రక్షన్ (విధ్వంసా లు), డిజప్పాయింట్‌మెంట్ (నిరుత్సాహం) వస్తుంటాయని... డీ మోటివేట్ (నిరుత్సాహ పరచ డం) చేసే వాళ్లుంటారని చెప్పారు. ఎక్కడా బెదరకూడదని చిరంజీవి పేర్కొన్నారు. చాలామందికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు.ఆలోచన విధానం మార్చు కుని కష్టపడే మనస్తత్వంతో ఇష్టమైన ప్రొఫెషన్‌లో ఉంటే ఒక స్థాయిలో రాణించవచ్చని చెప్పారు.
తనను తాను ఉత్తమంగా నిరూపించుకుంటూ ప్రయాణం సాగించానన్నారు. హీరోగా ఎదిగే సమ యంలో కొందరు నిర్మాతలు తక్కువ స్థాయి రౌడీ వేషాలు వేయమని తనను అడిగారని గుర్తు చేసుకున్నారు. తనను తాను ఎలా మార్చుకుందీ చిరంజీవి వివరించారు.












Click it and Unblock the Notifications