చంద్రబాబు పోస్టుపై స్పందించిన చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమవంతు సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ క్రమంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

'ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ సేవలో చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. వరదల వల్ల నష్టపోయిన జీవితాలను పునర్నిర్మించడంలో వారి సహకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Chiranjeevi responded to Chandrababu s social media post

ఈ క్రమంలో చంద్రబాబు పోస్టుపై చిరంజీవి స్పందించారు. 'మీరు నాపై చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. మన ప్రజలకు విపత్తులు ఎదురైనప్పుడు సాయం అందించడం మా కర్తవ్యం. మీ సహాయక చర్యలు ఆదర్శప్రాయం' అని చిరంజీవి వ్యాఖ్యానించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సాయం చేసేందుకు సినీ పరిశ్రమ నుంచి అనేక మంది నటులు తమవంతుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి సాయం అందించారు.

చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. శనివారం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి రూ. కోటి చెక్కులను అందించారు. చిరంజీవి తరపున రూ. 50 లక్షలు, రామ్ చరణ్ తరపున రూ. 50 లక్షలు చెక్కులను సీఎం చంద్రబాబుకు అందించారు.

మరోవైపు, చిరంజీవి సోదరుడు ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్‌ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించి అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+