పడవ ఎక్కుతూ నీటిలో జారి పడిన మంత్రి చిరంజీవి

జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, శానససభ్యుడు కన్నబాబు, జిల్లా మంత్రి తోట నర్సింహం ఒకేసారి పడవ ఎక్కడంతో అది పక్కకు ఒరిగిపోయింది. దీంతో చిరంజీవితో పాటు మిగిలినవారు నీటిలో పడిపోయారు
తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది వారిని పైకి తీశారు. దాంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత పడవలోని నీటిని తొలగించి తిమ్మాపురం పేటకాలువ గట్టుకు పర్యటన సాగించారు. పరిమితికి మించి ఎక్కడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.
చంద్రబాబుపై ఫైర్
వరద బాధితులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి చిరంజీవి అంతకు ముందు అన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు వరద బాధితులను, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే రైతుల రుణాలను మాఫీ చేస్తామని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications