ఆరేళ్లుగా చిత్తూరు ప్రశాంతం: టిడిపికి పట్టు చిక్కాక టెన్షన్, మేయర్ పదవిపై ఎలా?

చిత్తూరు: ఏపీలోని చిత్తూరులో మేయర్ దంపతుల దారుణ హత్య కలకలం రేపుతోంది. వరస హత్యలతో అతలాకుతయ్యే చిత్తూరు సిటీ దాదాపు ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉంటోదంని గుర్తు చేసుకుంటున్నారు. మంగళవారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

నగర ప్రథమ పౌరులకే రక్షణ లేకుండే సామాన్యులకు దిక్కేదని అందరూ వాపోతున్నారు. కార్యాలయంలోనే దాడి జరగడాన్ని పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. మేయర్ జంట హత్యల నేపథ్యంలో మళ్లీ పాత రోజులు వస్తాయా అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని చెబుతున్నారు.

సొంత వారి పాశవిక దాడితో నగరంలోనే మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ చనిపోవడం జీర్ణించుకోలేకున్నారు. ఒకేసారి పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులను కోల్పోవడంతో పార్టీ కూడా ఆందోళన చెందుతోంది.

Chittoor mayor Katari Anuradha stabbed to death: Who is new Mayor?

చాలాకాలం తర్వాత టిడిపికి పట్టు

గత కొంత కాలంగా నగంలో పట్టు సంపాదించుకుందామని ప్రయత్నించిన టిడిపికి పట్టు చిక్కలేదు. అయితే, ఇటీవలే పార్టీ గత వైభవాన్ని సంతరించుకుంది. ఆ సమయంలో సీకే బాబుని ఎదిరించి నిలబడిన కఠారి మోహన్‌కే నగర పాలన బాధ్యత అప్పగిస్తే బావుంటుందని ఆయన భార్యకు మేయర్‌ పీఠం కట్టబెట్టారు.

వైరి వర్గాలతో ముప్పు తప్పదని ఎవరి జాగ్రత్తలో వారు ఉన్నా పార్టీలో ఉంటూ సొంత మనిషే దాడికి పాల్పడటం టిడిపి వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

మేయర్ పదవిపై కసరత్తు

అనురాధ హత్య నేపథ్యంలో మేయర్‌ పదవి ఎవరికి కట్టబెడితే ఎటువంటి పార్టీ బండిని మూడేళ్లు లాగగలుగుతారో చర్చల్లో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వర్గాలను సైతం కలుపుకుంటూ ముందుకు వెళ్లేవారికి ఇవ్వాలని తెరవెనుక ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించారు.

2005లో కటారి మోహన్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పోటీ చేస్తుంటే, పోటీ నుంచి తప్పించాలని ఓ వర్గీయుల దాడి జరిగింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలతో బయటపడినా, ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు.

2007వ సంవత్సరం ఫిబ్రవరి రెండో వారంలో చిత్తూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేపై దాడికి తెగబడ్డారు. పిస్టళ్ల ద్వారా తూటాల వర్షం కురిపించారు. ఆ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడగా.. అతని గన్‌మెన్‌, ఓ మున్సిపల్‌ ఉద్యోగి, ముంబయికి చెందిన ప్రత్యర్థి దుండగుడు మృతి చెందాడు.

మళ్లీ అదే సంవత్సరం డిసెంబరు 30న చిత్తూరు మాజీ ఎమ్మెల్యేపై మందుపాతరతో పేలుడుకు యత్నించారు. ఆ ఘటనలో ఓ గన్‌మెన్‌ మృతి చెందారు. ఇలా వరుసగా దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆరేడేళ్లుగా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ హత్యోన్మాదం తెరపైకి వచ్చింది.

ఎప్పుడు ఎలాంటి పాత కక్షలు భగ్గుమంటాయోనని ప్రజలు నిత్యం బిక్కు బిక్కుమంటున్నారు. కింది అంతస్తులోని అందరనీ దాటుకుని పైన ఉన్న మేయర్‌ గదికి వెళ్లి, దుండగులు దాడి చేయడం పై చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+