కాంగ్రెస్ పార్టీలో చేరిన హీరో రాజా: తెలుగువారికి జాతీయ లీడర్ అంటూ వ్యాఖ్యలు

విజయవాడ: గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నటుడు రాజా.. తాజాగా మరోసారి రాజకీయ ప్రవేశం చేశారు. వెన్నెల, ఆనంద్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన రాజా.. అసలు పేరు రాజా అబేల్. రాజా తల్లి బ్రిటీషర్ కాగా, తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. సినిమాపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజా.. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదాన సినిమాతో నటుడిగా కెరరీ ప్రారంభించారు.

రాజాకు హీరోగా వెన్నెల సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో రాజాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. అయితే, సరైన స్టోరీలను ఎంచుకోకపోవడంతో హిట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే సినిమాలకు దూరమైన రాజా.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, వైఎస్ మరణం తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

Cine hero Raja joined Congress party on the presence of Gidugu Rudraraju

ప్రస్తుతం క్రిస్టియన్ పాస్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా, మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజా. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

Cine hero Raja joined Congress party on the presence of Gidugu Rudraraju

కాంగ్రెస్ లాంటి సెక్యూలర్ లోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. జాతీయ స్థాయిలో తెలుగువారికి లీడర్‌గా ఉండే అవకాశం తనకు కాంగ్రెస్ వల్ల వచ్చిందన్నారు. మణిపూర్ అంశంలో చాలా మంది నోరు మెదపలేకపోయారని రాజా విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+