ఏపీలో టెన్త్..ఇంటర్ పరీక్షలు రద్దు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : సుప్రీం కోర్టు సూచనలతో..!!

ఏపీలో పదో తరగతి..ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఈ పరీక్షల నిర్వహణ - కొనసాగింపు పైన అనేక చర్చలు జరిగాయి. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం తొలి నుండి పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతో కనిపించింది. కేంద్రంతో పాటుగా పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినా..ఏపీ ప్రభుత్వం జూలై లో పరీక్షల నిర్వహణకు సిద్దం అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక, ఇదే అంశం పైన సుప్రీం కోర్టులో విచారణ సాగింది. సుప్రీం సైతం పరీక్షల నిర్వహణ పైన అఫిడవిట్ కోరింది. ఏపీ ప్రభుత్వం జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహిస్తామని..కరోనా తగ్గుముఖం పట్టటంతో అన్ని చర్యలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది.

ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పైన సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది. సరైన సమాచారం లేకుండా అఫిడవిట్ దాఖలు చేసారని... అన్ని వేల మంది విద్యార్ధులకు ఎటువంటి సమస్యల లేకుండా పరీక్షలు ఎలా సాధ్యమని ప్రకటించింది. పరీక్షల నిర్వహణ సమయంలో ఎవరైనా మరణిస్తే ఒక్కోక్కరికి కోటి రూపాయాల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా జూలై 31 లోగా పరీక్షలు..మార్కులు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది.

AP Govt cancels 10th and Inter exams after a huge criticism from across.

అయితే, పరీక్షల నిర్వహణ..మూల్యాంకణ..ఫలితాల ప్రకటనకు దాదాపుగా 40 రోజుల సమయం పడుతుందని...పరీక్షల నిర్వహణ పైన 15 రోజులు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో..కోర్టు సూచించిన విధంగా జూలై 31 లోగా పరీక్షల ప్రక్రియ పూర్తి చేయటం సాధ్యం కాదని నిర్ధారణ కావటంతో..ముఖ్యమంత్రి జగన్ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఇక, మార్కులు కేటాయింపు కోసం హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+