ఆ హీరోల కంటే వారే గొప్పవారు - చంద్రబాబు..!!

స్పైడర్‌మ్యాన్‌ వంటి సూపర్‌ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. భారతీయులు భవిష్యతుల్లో ప్రపంచాన్ని శాసిస్తారనడంలో సందేహం లేదని ధీమా వ్యక్తం చేసారు. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని చెప్పారు.మన దేశంలో నాలెడ్జ్‌కు కొదవలేదని అలానే దేశాభివృద్ధిలో అనేక రంగాలు మిళితమై ఉన్నాయని చెప్పారు.

తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. పేద రికం లేని దేశంగా భారత్‌ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఇంకా మన దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. 2038 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని 2047 నాటికి ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుంద తెలిపారు.

CM Chandra Babu made interesting speech and Appeal for Parents in Bharatiya Vignan Sammelan

మన దేశం పేరు మార్మోగిపోతుందని, ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉన్నారని కొనియాడారు. దశాబ్ద కాలంగా చాలా దేశాల్లో జనాభా తగ్గుతుండగా భారత్‌లో మాత్రమే పెరుగుతోందని వెల్లడించారు. హాలీవుడ్‌లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్ప వారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు.

బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వివరించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు చంద్రబాబు. శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సి ఉందని సూచించారు.

CM Chandra Babu made interesting speech and Appeal for Parents in Bharatiya Vignan Sammelan

కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందన్నారు. అప్పుడే మన పిల్లలు మంచికి, చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైథాలజీ గురించి అందరూ మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలకపాత్రని చెప్పారు.

యోగా ద్వారా భారతదేశం యూనివర్సల్ హెల్త్‌ను అందించిందన్నారు. జీరోను భారతీయులే కనిపెట్టారని గుర్తు చేశారు. చెస్ ఆట సైతం మనదేనని వివరించారు. భారతీయ కుటుంబ జీవితం మన దేశంలో మాత్రమే ఉందన్నారు. ఇది భద్రతతో పాటు జీవితాల్లో వెలుగునిస్తోందని పేర్కొన్నారు. ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. సౌర, పవన విద్యుత్తుపై అధికంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి ఆపరేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయడానికీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక వేతనాలను భారతీయులు పొందుతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+