పెన్షన్లు, ఇళ్ల పంపిణీపై చంద్రబాబు గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమం.. అందులో పెన్షన్లకు ఇస్తున్న ప్రాధాన్యత పైన పార్టీ నేతలు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పేదల సేవ కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఇళ్ల పంపిణీ పైన కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నిర్దేశించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 17 నెలల్లో కేవలం సామాజిక పింఛన్లకే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 'ఎన్టీఆర్ భరోసా పింఛన్లు' దేశంలోనే అతిపెద్ద డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్-ప్రత్యక్ష నగదు బదిలీ) కార్యక్రమంగా అభివర్ణించారు. 'పేదల సేవలో' కార్యక్రమంలో ప్రతి నేతా పాల్గొనాలని పిలుపిచ్చారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏటా వృద్ధాప్య పింఛన్‌దారులకు రూ.48 వేలు, డయాలసిస్ రోగులకు రూ.1.20 లక్షలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు రూ.1.80 లక్షల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మరే రాష్ట్రమూ ఈ స్థాయిలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయడం లేదన్నారు. త్వరలోనే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చే విధానం అమలు చేస్తామన్నారు.

కాగా, కొన్నిచోట్ల అనర్హులకు పింఛన్లు అందుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని పరిశీలి మని తెలిపారు. అర్హులు ఏ పార్టీకి చెందిన వారైనా అన్యాయం జరగనివ్వబోమని స్పష్టంచేశారు. మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెబితే కూటమిని కాదని పక్క పార్టీలకు వారు ఓటేయరని.. సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు ప్రజలతో నేతలు మమేకం కావాలని సూచించారు. గత ప్రభుత్వ వైఫల్యాల పై ప్రజల్లో ఇంకా చర్చ జరగాలని సూచించారు. నిలిపివేసిన నీరు-చెట్టు, ఉపాధి హామీ బిల్లుల విషయంలో కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయించామని చెప్పారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తామని.. అర్హుడైన ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలన్నది మన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు.
ఇక.. టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబరు క్యాలెండర్ రూపొందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. డిసెంబర్ 1న పింఛన్ల పంపిణీ, 3న రైతుసేవా కేంద్రాల్లో వర్క్ షాపుల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు, 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. వీటన్నిటిలోనూ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. కాగా.. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గ మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి సత్కరిస్తారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications