అన్నా క్యాంటీన్ల నిర్వహణపై చంద్రబాబు కీలక ప్రకటన..!!
త్వరలోనే అన్న క్యాంటీన్స్‌ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంచి చేసే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ తీరును ప్రస్తావించారు. తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు.
వారికి స్వాగతం
ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి.. ఆ శక్తి దేవుని రూపంలో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎవరైతే ఐటిని ఎడాప్ట్ చేసుకుంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 20 సంవత్సరాల క్రితం నేను ఐటీని ప్రమోట్ చేశానని గుర్తు చేసారు. ఏ దేశానికి వెళ్లినా భారతదేశానికి చెందిన వారుంటారన్నారు. అందులో తెలుగువారు అత్యధికంగా ఉంటారని వివరించారు. వేంకటేశ్వర స్వామి తమ కుల దైవమని చెప్పిన చంద్రబాబు.. నేను నమ్మిన దేవుడు.. ప్రార్థన చేసే దేవుడు.. నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వేంకటేశ్వర స్వామేనని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం తీరు
పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసిందన్నారు. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత 5 ఏళ్ళలో జరిగిందన్నారు. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు. పేదరికం లేని సమాజాన్ని దేశంలో తీసుకురావాలి జీరో పావర్టీ స్టేట్‌గా మన ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దామన్నారు. అక్షయ పాత్ర ద్వారా 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనాలు పెట్టారని చెప్పుకొచ్చారు.
అక్షయ పాత్ర ద్వారా నాడు పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, కక్ష కట్టి అవి మూసేయించింది. త్వరలోనే మళ్ళీ పేదల కోసం అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/6M7jvKnmqY
— Telugu Desam Party (@JaiTDP) July 13, 2024
అన్నా క్యాంటీన్లు
అక్షయపాత్ర ద్వారా రోజుకు 22 లక్షల మందికి భోజనాలు అందిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అన్న క్యాంటీన్స్‌ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంచి చేసే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. భారతీయులు బాగుండాలని.. అందులో ఆంధ్రులు అగ్రస్థానంలో ఉండాలన్నారు. మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడుతుందన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలనుంచి వచ్చే వినతలను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications