కరకట్ట ఇంటిని వీడనున్న చంద్రబాబు - ఇక కేరాఫ్, 5 ఎకరాల్లో..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సమయం నుంచి కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. ప్రతిపక్షంలోనూ.. ఇప్పుడు తిరిగి అక్కడే కొనసాగుతున్నారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు నివాసం మారనుంది. అమరావతి లో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు కుటుంబం అక్కడే ఇంటిని నిర్మాణానికి సిద్దమైంది. పూర్తి చేసిన తరువాత చంద్రబాబు వెలగపూడి ఇంటిలోనే ఉండనున్నారు.

వెలగపూడిలో అయిదు ఎకరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం మారనుంది. ఇప్పటి వరకు ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమేనని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఉండటం పైన రాజకీయంగా నూ చర్చ జరిగింది. కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో ఆ ఇంట్లోకి నీరు వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం అమరావతిలోని వెలగపూడిలో 25 వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలో గృహం, భద్రత సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, లాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల నుంచి స్థలం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో భూ సార పరీక్షలు చేయిస్తున్నారు.

CM Chandra Babu planning for new house construction in Velagapudi details here

కొత్త ఇంటి నిర్మాణం
వెలగపూడిలో చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి. అక్కడే కీలకమైన భవనాలు, గజెటెడ్ అధికారులు, ఎన్‌జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు దగ్గరలో రెండు కిలోమీటర్లు దూరంలో ఈ స్థలం ఉంది. మొత్తంగా అయిదు ఎకరాల స్థలం చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి త్వరలో రిజిస్ట్రేషన్ జరగనుంది. దీంతో, ప్రస్తుతం ఉంటున్న నివాసం ఖాళీ చేయనున్నారు. అమరావతిలోనే తాను సొంత ఇంటిని నిర్మించుకుంటానని గతం లోనే చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి వాసిగా
చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పనులు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమరావతిలోనూ కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబుకు అమరావతిలో శాశ్వత నిర్మాణం లేదని వైసీపీ పలు మార్లు ఆరోపించింది. ఇప్పుడు రాజధానిగా అమరావతి నిర్మాణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో ప్రణాళికల అమలుకు రంగం సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తాను అమరావతిలోనే ఉండేలా కొత్త ఇంటి నిర్మాణానికి నిర్ణయించారు. నిర్మాణం పూర్తయితే చంద్రబాబు ఇక అమరావతి వాసి కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+