Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నామినేటెడ్ పదవులపై చంద్రబాబు కసరత్తు - దక్కేదెవరికి..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం..పార్టీ పరంగానూ వేగంగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా కీలక శాఖల్లో అధికారుల బదిలీ పైన కసరత్తు చేస్తున్నారు. తన కార్యాలయ టీంను ఇప్పటికే సిద్దం చేసుకున్నారు. పార్టీ పరంగానూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన ఫోకస్ చేసారు. ఎవరికి పదవులు దక్కేదీ చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

చంద్రబాబు నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రతీ రోజు సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ప్రతీ సోమవారం గతంలో తరహాలోనే పోలవరం పైన సమీక్షలు..పోలవరం సందర్శనకు నిర్ణయించారు. అదే విధంగా మంత్రులు సైతం సచివాలయంకు రావాలని..జిల్లాల పర్యటనలతో పార్టీ కార్యాలయంలో కేడర్ కు అందుబాటులో ఉండాలని సూచించారు. చంద్రబాబు ప్రతీ వారాంతం పార్టీ కార్యాలయంకు రావాలని నిర్ణయించారు.

CM Chandra Babu to appoint nominated posts soon Assurance for party leaders

పార్టీ కార్యాలయంలోనూ
తాజాగా చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. అధికారం వచ్చిందని కక్షసాధింపులకు పాల్పడవద్దని వారికి సూచించారు. చట్టప్రకారం జరిగేది జరుగుతుందని చెప్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయొద్దని హితవు పలికారు. అలాగే కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని చెప్పుకొచ్చారు. బాధ్యత, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో పార్టీ నేతలకు గుడ్‌న్యూస్‌ కూడా చెప్పారు చంద్రబాబు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు కసరత్తు
పలువురు సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. దీంతో, నామినేటెడ్ పదవుల ద్వారా సీనియర్లకు పదవులు ఇవ్వటంతో పాటుగా కింది స్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావటంతో మిత్రపక్షాలైన జనసేన..బీజేపీ నేతలకు పదవులు కేటాయించాల్సి ఉంది. సీట్లు దక్కని నియోజకవర్గ నేతలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. దీంతో..రాష్ట్ర స్థాయి..జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఎంపిక ఎలా ఉంటుందనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+