మొదలైన తుఫాన్ ప్రభావం, ఈ జిల్లాలకు భారీ ఎఫెక్ట్- చంద్రబాబు తాజా ఆదేశాలు..!!

మొంథా తుఫాన్‌ తీర ప్రాంతాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రభావం మొదలైంది. తుఫాన్‌ సన్నద్దత చర్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. ప్రధాని సైతం తుఫాను చర్యల పై ఆరా తీసారు. కేంద్రం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇక.. తుఫాను తీరం దాటే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రధానంగా కోస్తా జిల్లాల పైన ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు.. ప్రచండ గాలులు .. ఫ్లాష్ ఫ్లడ్స్ పైన అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

మొంథా తుఫాను పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు. తుఫాను ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైమ్‌లో సమాచారం అందించాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ తుఫాన్ బులిటెన్లు విడుదల చేస్తూ, అప్రమత్తం చేయాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

CM Chandrababu Key Instructions to Officials on Montha Cyclone Effect

తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3,211 జెనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాలబారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.

పునరావాస శిబిరాలకు తరలించిన వారికి వారికి 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామో, తుఫాన్లను ఎదుర్కొనేందుకూ పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా, కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్‌కు ముఖ్యమంత్రి అప్పగించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ. దూరంలో ఉన్న మొంథా తుఫాన్...16 కి.మీ వేగంతో తీరానికి చేరువ అవుతూందని అధికారులు వివరించారు.

CM Chandrababu Key Instructions to Officials on Montha Cyclone Effect

కాగా, ఇప్పటికే ఉత్తర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయని... మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. మంగళవారం రాత్రికి తుఫాన్ తీరానికి చేరే అవకాశం ఉందన్నారు. ఎక్కవ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎన్డీఆర్, ఎస్డీఆర్ దళాలు అందుబాటులో ఉండాలని, ఫైర్ సర్వీసెస్ కూడా అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ టీమ్, రహదారులు-భవనాల శాఖ, విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తతో వ్యహరించాలన్నారు. రహదారులు కోతకు గురైనా, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడినా వెంటనే పునరుద్ధరించేలా మెటీరియల్, మిషనరీ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+