ఏపీ కృషిని గుర్తించిన కేంద్రం: థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు
దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ముగిశాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్.. వివిధ రంగాల్లో దేశం సాధించిన పురోభివృద్ధికి అద్దం పట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండువగా సాగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరైన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర కేంద్రమంత్రులు, వివిధ శాఖలు, విభాగాల అధికారులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆహ్వానితుల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ పరేడ్‌లో ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఏపీ- ఏటికొప్పాక బొమ్మలు, ఉత్తరప్రదేశ్- మహా కుంభమేళా 2025, త్రిపుర- ఎటర్నల్ రెవెరెన్స్ కాన్సెప్టులతో సాగాయి. ఈ మూడింటితో పాటు హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్.. వంటి రాష్ట్రాల శకటాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి.
ఆయా శకటాలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మూడు అత్యుత్తమ శకటాలను ఎంపిక చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాకు సంబంధించిన థీమ్‌తో ఈ శకటం రూపుదిద్దుకుంది. సాగరమథనాన్ని ప్రతిబింబించేలా అది రూపొందింది.
రెండో అవార్డు- త్రిపురకు లభించింది. ఖార్చీపూజా కాన్సెప్ట్‌తో తయారైందా శకటం. 14 దేవతామూర్తులను ఎలా పూజిస్తారనే థీమ్‌ను ఇందులో ప్రదర్శించారు. ఎటర్నల్ రెవెరెన్స్ అనే పేరుపెట్టారు. దీనికి రెండో అత్యుత్తమ శకటం అవార్డు లభించింది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడం సంతోషకరం... రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, రెండవ… pic.twitter.com/mxD0RdX03O
— N Chandrababu Naidu (@ncbn) January 29, 2025
మూడో అవార్డు ఏపీకి లభించింది. ఎకో ఫ్రెండ్లీ థీమ్‌తో ఈ శకటం రూపొందింది. చారిత్రాత్మక ఏటికొప్పాక బొమ్మలను ఈ శకటం ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది ప్రభుత్వం. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని విధంగా అందమైన బొమ్మలను ఎలా సృష్టించవచ్చో వివరించింది.
ఏపీకి ఈ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో కూడిన రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని వ్యాఖ్యానించారు.
కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో త్రిపుర నిలిచాయని పేర్కొన్నారు. మూడో స్థానం ఏపీకి దక్కిందని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు, ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications