ఏపీలో భారీ వర్షాలు-అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు జగన్ ఆదేశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సాధారణ జనజీవనానికి కూడా అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ కాపునేస్తం పథకంలో భాగంగా నిధుల బదిలీని వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం కలెక్టర్లతో మాట్లాడారు. వివిధ జిల్లాల్లో తాజా పరిస్దితుల్ని అడిగి తెలుసుకున్నారు. భారీవర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల్ని సమీక్షించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.

అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు ముంపుకు గురి కాకుండా చూడాలని, జనాన్ని ముందుగానే అక్కడి నుంచి తరలించాలని సీఎం జగన్ సూచించారు. అలాగే ప్రాజెక్టుల్లో నీటి మట్టాల్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications