వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ సడలింపులతో భారీ జనం వచ్చే ఛాన్స్.... కీలక సమయం జాగ్రత్త అంటున్న సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇక తాజాగా కేంద్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థుల విషయంలో స్వరాష్ట్రాలకు వెళ్ళవచ్చని మార్గదర్శకాలు విడుదల చెయ్యటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, ఇప్పుడే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు .

Recommended Video

YS Jagan's Idea To Save Economy Draws Huge Support | Red Zone | Green Zone | Oneindia Telugu

 పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటే పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటే

కేంద్రం ఆదేశాల నేపధ్యంలో అలెర్ట్ గా ఉండాలన్న సీఎం జగన్

కేంద్రం ఆదేశాల నేపధ్యంలో అలెర్ట్ గా ఉండాలన్న సీఎం జగన్

లాక్‌డౌన్‌ సడలింపులతో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు .ఇక ఈ సమయంలో స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సీఎం విస్తృతంగా అధికారులతో చర్చించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం సహా పలు అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబుకు సూచించారు.

భారీ సంఖ్యలో ఏపీ జనం వచ్చే అవకాశం .. స్క్రీనింగ్ , క్వారంటైన్ విషయంలో జాగ్రత్త

భారీ సంఖ్యలో ఏపీ జనం వచ్చే అవకాశం .. స్క్రీనింగ్ , క్వారంటైన్ విషయంలో జాగ్రత్త

ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా ఆయన ఆదేశించారు. విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా అక్కడే కరోనా పరీక్షలు చేసి పంపిస్తారని ఇక వారికి కరోనా లేదని నాన్ కోవిడ్ సర్టిఫికెట్‌ ఉంటుందని, అలాంటి వారిని హోం క్వారంటైన్‌ విధించాలని అన్నారు.ఇక ఇతర రాష్ట్రాలైన గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చెక్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని, పాజిటివ్ ఉంటే ఐసోలేషన్ వార్డులకు షిఫ్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ 19 పరీక్షలు జరగగా నిన్న ఒక్కరోజే 7902 మందికి పరీక్షలు చేశారని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.

 అధికారులను అన్ని జిల్లాల పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం ... అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

అధికారులను అన్ని జిల్లాల పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం ... అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఇప్పటికే కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జాగ్రత్త అవసరం అని, ఇక వలస వచ్చే వారి విషయంలో చాలా ప్లాన్డ్ గా పరీక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు.ఇక కరోనా కేసులు బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలలో తాజా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇక అధికారులు కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32వేల 792 మందిలో 17,585 మందికి పరీక్షలు జరిగాయని మిగిలిన వారికి 23 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్టు సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే వీరికి వెంటనే పరీక్షలు చేసి ఫలితాలను బట్టి ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

English summary
CM said that the exemptions of lockdown large number of people will come from abroad and from other states . CM Jagan ordered the officials to screening and quarantine measures have to be taken in aproper way . Senior IAS officer Krishna Babu advised the Quarantine Center to regularly review facilities, sanitation and meals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X