ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ - చంద్రబాబు అంశంపై : సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారు..!!

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు..తదనంతరం ప్రభుత్వం పైన విమర్శల సమయంలో ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ సమావేశం ఆకస్మికంగా ఏర్పాటు చేయటం రాజకీయ ఉత్కంఠకు కారణమవుతోంది. ఇప్పటికే నాలుగు జిల్లాలు భారీ వర్షాలు..వరదలతో బాగా దెబ్బ తిన్నాయి. అసెంబ్లీకి సమావేశాలకు ఆ జిల్లాలకు చెందిన మంత్రులు..ఇన్ ఛార్జ్ మంత్రులు..ఎమ్మెల్యేలు రావద్దని..సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్దేశించారు.

ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు

ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు

అదే సమయంలో ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 30 మందికి పైగా మరణించారని..వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే అంచనాకు వచ్చారు. ఇక, మరణించిన వారికి అయిదు లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇదే సమయంలోనూ రాజకీయంగా వైసీపీ పైన చంద్రబాబుతో సహా నందమూరి కుటుంబం.. పలువురు రాజకీయ నేతలు రెండు రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరు పెట్టిన తరువాత..అందరూ వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

చంద్రబాబు వ్యవహారానికి కౌంటర్ ఇవ్వాలని

చంద్రబాబు వ్యవహారానికి కౌంటర్ ఇవ్వాలని

మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు తాము చంద్రబాబు సతీమణి పేరు ప్రస్తావించలేదని..అమెను ఏమీ అనలేదని చెబుతున్నా..విమర్శలు మాత్రం ఆగటం లేదు. తన ప్రభుత్వాన్ని..పార్టీని కార్నర్ చేస్తూ..సున్నిత అంశాల విషయంలో ఆరోపణలు చేస్తూ పార్టీకి డామేజ్ చేస్తున్న అంశాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో..ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన ఈ సమావేశంలో ముఖ్యమం్తరి మంత్రులతో చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఒక వైపు వరదలు..మరో వైపు టీడీపీ సైతం సమావేశాలు బహిష్కరించటంతో ఇక, ఈ సమావేశాలను సైతం ఈ రోజుతో ముగించే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

    అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Oneindia Telugu
    అసెంబ్లీ సమావేశాల కొనసాగింపా..ముగింపా

    అసెంబ్లీ సమావేశాల కొనసాగింపా..ముగింపా

    సభలో ఈ రోజున బీసీ కుల గణన పైన తీర్మానం... బీసీ-ఎస్సీ-ఎస్టీ సంక్షేమం పైన చర్చ చేపట్టాలని అజెండాగా ఖరారు చేసారు. ఇక, టీడీపీ శుక్రవారం నాడు సభలో చంద్రబాబు సతీమణిని దూషించారని..ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆ రోజు జరిగిన సంఘటలన ఫుటేజ్ విడుదల చేయాలంటూ స్పీకర్ కు లేఖ రాసింది. ప్రభుత్వం సైతం ఆ రోజు ఏం జరిగిందో ప్రజలకు అసెంబ్లీ వేదికగానే ప్రజలకు వివరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఈ మొత్తం వ్యవహారాల పైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో..ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+