ముకుల్ రోహిత్గీతో సీఎం జగన్ మంతనాలు: ఛైర్మన్ నిర్ణయం పైనే: ఆ నిర్ణయం దిశగా!
మూడు రాజధానుల బిల్లుల ఆమోదానికి బ్రేక్ పడటం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించటం..లేదా తిరస్కరించాల్సిన సమయంలో ఇలా మండలి ఛైర్మన్ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవటం..బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంలో న్యాయ పరమైన..రాజ్యంగ పరంగానూ టీడీపీ సమస్యలు తెచ్చి పెడుతుందని ముఖ్యమంత్రి ముందుగానే అంచనాకు వచ్చారు. దీంతో..తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం పైన ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహిత్గీని ఎంపిక చేసుకున్నారు. ఆయనతో క్యాంపు కార్యాలయంలో కీలక మంతనాలు జరిపారు. ఈ రోజు ఏపీ హైకోర్టులో రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ జరుగుతోంది. దీంతో..ఈ మొత్తం వ్యవహారాల పైన వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది.
ముఖుల్ రోహిత్గీతో సీఎం కీలక భేటీ...
మూడు రాజధానుల వ్యవహారంలో ముందుకెళ్లే అంశంలో ముఖుల్ రోహిత్గీ సూచనల మేరకు నడుచుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. శాసనమండలిలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటంతో తదుపరి వ్యూహం పైనా ముఖుల్ రోహిత్గీతో జగన్ మంతనాలు జరిపారు. రాజ్యాంగ..న్యాయ పరంగా ఇబ్బందులు లేకుండా ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలనే దాని పైన వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా..ప్రభుత్వం తమ న్యాయవాదిగా రోహిత్గీని నియమించుకుంది.

అందుకోసం ఆయనకు అయిదు కోట్లు చెల్లించాలని డిసైడ్ అయింది. అడ్వాన్సుగా కోటి రూపాయల విడుదలకు ఉత్తర్వులిచ్చింది. ఇక, కాసేపటి క్రితం జరిగిన సమావేశంలో ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో రాజధాని రైతులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్లపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖుల్ రోహిత్గీ ఏపీ సీఎంతో మంతనాల తరువాత ఏపీ హైకోర్టుకు వెళ్లారు.
ఆర్డినెన్స్ తెస్తే..నిలబడుతుందా..
మండలిలో ఎదురైన పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్న సీఎం జగన్..ముందుగా మంత్రులు..విజయసాయిరెడ్డితో సమాలోచనలు చేసారు. న్యాయ..రాజ్యాంగ పరమైన అంశాలపై చర్చ చేసారు. మండలి చైర్మన్ షరీఫ్ క్షున్నంగా నిర్ణయాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం.. దీనికి కౌంటర్ వ్యూహం ఏ విధంగా అమలు చేయాలనే దాని పైన ఆలోచన చేస్తోంది. అందులో బాగంగా అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తున్న సీఎం.. దీని పైన ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహిత్గీతోనూ చర్చించారు. ప్రస్తుతం బిల్లు సెలెక్ట్ కమిటీకి నివేదించటంతో ఆర్డినెన్స్ జారీ చేయాలంటే మండలిని సైతం ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది.
అయితే, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన తరువాత..ఆర్డినెన్స్ తెస్తే న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందుల పైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక, అసెంబ్లీలో చేసిన తీర్మానం ఆధారంగా ముందుకెళ్లే అవకాశాలు..అందులో ఉన్న సమస్యల పైన సీఎం..ముఖుల్ రోహిత్గీ చర్చించినట్లు సమాచారం. ఈ రోజు హైకోర్టులో వాదనలు ముగిసిన తరువాత దీని పైన ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications