కౌలు రైతుల రుణాలపై బ్యాంకర్లపై సీఎం జగన్ అసంతృప్తి .. ఆ మార్గాలపై ఫోకస్ పెట్టాలని సలహా
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం కోసం బ్యాంకులు ముందుకు రావాలని, కౌలు రైతులు ఆందోళన విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్న సీఎం జగన్ ప్రభుత్వం నుండి బ్యాంకులకు గతంలో చెల్లించాల్సిన వడ్డీ లేని రుణాలు కింద ఉన్న బకాయిలను చెల్లించామని, బ్యాంకర్ల సహకారం ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు.
Recommended Video

రైతులకు బ్యాంకర్లు 99 శాతం పంట రుణాలు ఇచ్చారన్న జగన్
కౌలు రైతులకు సహకారం అందించే విషయంలో బ్యాంకులు మరింత చిత్తశుద్ధితో వ్యవహరించలేదని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి రైతులకు బ్యాంకర్లు 99 శాతం పంట రుణాలను ఇచ్చారని పేర్కొన్నారు . అయితే వారి ఆదాయ మార్గాలను పెంచే విధానాలపై బ్యాంకర్లు కూడా ఫోకస్ చెయ్యాలని కోరారు. 213 వ ఎస్ ఎల్ బీసీ సమావేశంలో వ్యవసాయ రుణాల పై చర్చించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న దానిపై బ్యాంకర్లు ఫోకస్ చేయాలని సీఎం జగన్ సూచించారు.

విపత్తుల సమయంలో రైతులకు చేదోడుగా బ్యాంకర్లు నిలవాల్సిన అవసరం
విపత్తుల సమయంలో రైతులకు చేదోడుగా బ్యాంకర్లు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఎంఎస్ఎంఈలకు కూడా అండగా నిలబడితే ఆర్థికవ్యవస్థ బాగుంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసంఘటిత రంగం కింద ఉన్న చిరు వ్యాపారులను కూడా బ్యాంకర్లు తోడ్పాటు అందించి ముందుకు తీసుకు రావాలని, చిరు వ్యాపారులు విషయంలో ప్రభుత్వం షూరిటీ ఇస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎస్ ఎల్ బీసీ మీటింగ్ లో జగన్ .. చిరువ్యాపారులకు , మహిళలకు బ్యాంకర్ల తోడ్పాటు
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఎల్బిసి మీటింగ్ లో పాల్గొన్న జగన్ జగనన్న తోడు క్రింద చిరు వ్యాపారులకు 10000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వారి జీవితాలను మార్చటానికి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జగన్ ఈ సందర్భంగా కోరారు. మహిళలు సాధికారత సాధించడం కోసం బ్యాంకులు సహకారం అందించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.

సంక్షేమ పథకాలకు బ్యాంకర్ల సహకారం కోరిన జగన్
2014 నుండి పరిశ్రమల రాయితీల బకాయిలను 1,100 కోట్ల మేర చెల్లించామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు అందించాల్సిన తోడ్పాటును ఎప్పటికప్పుడు అందించాలని కోరారు జగన్. తాడేపల్లి లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కన్నా బాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, సీరియస్ నీలం సాహ్ని, ఆర్బిఐ ప్రాంతీయ డైరెక్టర్ కే నిఖిల తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications