సీఎం జగన్ "ముందస్తు" కసరత్తు..!! రంగంలోకి పీకే టీం - నెక్స్ట్ ఆ మంత్రులే టార్గెట్..!!
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి జగన్ మూడేళ్లు పూర్తి చేసుకుంటున్నారు. మిగిలిన కాలం సద్వినియోగం చేసుకొంటూ.. మిషన్ -2024 పూర్తి చేసేందుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తన కార్యాచరణ వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా అవసరమై మేర ప్రక్షాళన ప్రారంభించారు. వివాదాలకు అవకాశం లేకుండా.. గతం కంటే భిన్నంగా నిర్ణయాలను మార్చుకొనేందుకు సిద్దమవుతున్నారు. తన కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పై వేటు వేసారు. ఆ తరువాత డీజీపీని తప్పించారు. ఇక, ఇప్పుడు సీఎంలో కీలక అధికారుల కు స్థానం కల్పించటంతో కొత్త జిల్లాల ఏర్పాటును పరిగణలోకి తీసుకొని ముఖ్యమైన శాఖల ఉన్నతాధికారులు.. జిల్లా యాంత్రాగాన్ని మార్చేందుకు కసరత్తు జరుగుతోంది.

ఉగాది నాటికి సిద్దం.. కొత్త అడుగులు
ఉగాది నుంచి కొత్త జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. అదే సమయంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును తిరిగి న్యాయ పరంగా చిక్కులు లేకుండా.. అమరావతి రాజధానిగా... మిగిలిన రెండు రాజధానులను ఉప రాజధానులుగా పేర్కొంటూ బిల్లు ప్రతిపాదించే దిశగా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఇక వేళ న్యాయపరంగా దీనికి చిక్కులు ఏమైనా ఎదురైతే..సీఎం జగన్ మాత్రం విశాఖ కేంద్రంగా తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి..అక్కడి నుంచి పాలన సాగించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగుస్తూనే...కొత్త జిల్లాలతో పాటుగా.. అటు ప్రభుత్వం..ఇటు పార్టీలోనూ కీలక మార్పుల దిశగా సీఎం నిర్ణయాలు ఉండనున్నాయి. కేబినెట్ విస్తరణ పైన సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

రంగంలోకి దిగుతున్న పీకే టీం
సాధ్యమైనంత వరకూ పూర్తిగా కొత్త వారితోనే కేబినెట్ రూపకల్పన చేయనున్నారు. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు ఖాయంగా తెలుస్తోంది. అందులో భాగంగా.. అటు పార్టీకి - ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసేందుకు మరో టీం సిద్దం అవుతున్నట్లు సమాచారం. సీనియర్లు బొత్సా .. పెద్దిరెడ్డి.. పేర్ని నాని.. కన్నబాబు.. బాలినేని వంటి వారికి జిల్లాలను జోన్ లుగా విభజించి బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. 2024 వరకు ఎన్నికలకు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికల దిశగానే జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత 2024 ఎన్నికల నిర్వహణ పైన కేంద్రం ఈ ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా...వెళ్లకున్నా..ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సైతం జగన్ అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీ-ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా
ప్రస్తుతానికి పధకాల నిర్వహణ ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉందని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇక, ఉగాది తరువాత అత్యధిక సమయం జనంలోనే ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనగా స్పష్టమవుతోంది. దీని ద్వారా అటు ప్రభుత్వం..ఇటు పార్టీలోనూ సమూల మార్పులు.. స్పష్టమైన లక్ష్యాలతో సీఎం జగన్ ముందస్తు ఎన్నికల కోసం సిద్దం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, మిగిలిన ఒకటిన్నారేళ్ల కాలం పూర్తిగా ప్రజలతోనే ఉండే విధంగా కార్యాచరణ సిద్దం అవుతుందని చెబుతున్నారు. తెలంగాణలో 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ సడన్ గా ముందస్తుకు వెళ్లి..ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా చేసిన విధంగానే..జగన్ సైతం అదే ఆలోచనలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముందస్తు ప్రణాళికలు- టార్గెట్ 2023
ఇక, ఏప్రిల్ నుంచి ప్రశాంత్ కిషోర్ టీం సైతం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది. జాతీయ రాజకీయా పైన ఫోకస్ పెట్టిన ప్రశాంత్ కిషోర్..తన టీంను ఇప్పటికే ఏపీలో మోహరించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో చోటు చేసుకొనే పరిణామాల ఆధారంగా జగన్ మరిన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకొనే అవకాశమూ కనిపిస్తోంది. అయితే, ఏది ఏమైనా ఏపీలో మాత్రం జగన్ ది ఒంటరి పోరే. దీంతో..ఉగాది నుంచి సీఎం జగన్ వేసే రాజకీయ అడుగులు..ఏపీలో మరోసారి ఎన్నికల సంగ్రామానికి వేసే తొలి అడుగులుగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications