త్వరలో మళ్ళీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ, బటన్ నొక్కనున్న సీఎం జగన్!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలుచేసే అవకాశాల్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఏపీలో రైతులకు మూడో విడత రైతు భరోసా జమ చేసిన వైయస్ జగన్, ఏపీ రైతులకు మరొక శుభవార్త చెప్పారు. మిచాంగ్ తుఫాన్ తో తీవ్ర వర్షాల కారణంగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2023- 24 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు.
ఈ రెండు విపత్తుల కారణంగా నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు 1 294. 58 కోట్ల రూపాయలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు ఈనెల 6వ తేదీన తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతులకు ఖాతాలకు నేరుగా పంట నష్టపరిహారాన్ని జమ చేయనున్నారు.

ఇప్పటికే సీఎం జగన్ రైతాంగం కోసం వైయస్సార్ రైతు భరోసా తో పాటు 0 వడ్డీ రాయితీ కింద రైతన్నలకు 1294.34 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేశారు. ఇక ఇదే సమయంలో మరో మారు అన్నదాతలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జగన్ సర్కార్ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండాలని భావించింది.
అందుకే త్వరితగతిన వారికి పంట నష్టపరిహారం అందించాలని నిర్ణయించిన సీఎం జగన్ ఆరవ తారీఖున పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాలను తీసుకొని నష్ట పరిహారం అందించే రైతుల పంట వివరాలను సేకరించిన సీఎం జగన్, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మొత్తం 11, 59,126 మంది రైతులకు 20,93,377 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, వీరందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు.
ఈ క్రమంలోనే ఈ నెల ఆరవ తేదీన పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వనున్నారు. కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకు 6,800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని 8,500 రూపాయలకు పెంచారు. నీటిపారుదల భూములయితే 13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని 17 వేలకు పెంచారు.
ఉద్యాన పంటలకు 7,500 నుంచి 17 వేలకు పెంచారు. వరి, వేరుశనగ, పత్తి, చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టారుకు 15000 చొప్పున ఇస్తుంటే ప్రస్తుతం 17వేల రూపాయలకు పెంచారు. ఇక మామిడి నిమ్మ జాతి తోటలకు 20వేల రూపాయలు నుంచి 22,500 రూపాయల వరకు పరిహారాన్ని పెంచారు. మల్బరీ తోటలకు 4,800 నుంచి 6 వేలకు ఇన్పుట్ సబ్సిడీని పెంచారు.












Click it and Unblock the Notifications