రాజధాని నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త స్కెచ్ - చెక్..!?
అమరావతి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవటం సీఎం జగన్ లక్ష్యం. వై నాట్ 175 నినాదం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పైన పూర్తి సమాచారంతో సిద్దమైన ముఖ్యమంత్రి అవసరమైన మార్పుల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఆరు నెలలకు ముందే అభ్యర్దులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక కొత్త సమీకరణాలను తెర మీదకు తీసుకొస్తోంది. రాజధాని నియోజకవర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతంది. తాజాగా సీనియర్ నేతకు ఎమ్మెల్సీ రెన్యువల్ లేకపోవటంతో..ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్సీగా నో ఛాన్స్..వాట్ నెక్స్ట్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా 18 మంది ఎమ్మెల్సీలను ఒకే సారి ఖరారు చేసారు. స్థానిక సంస్థలు..ఎమ్మెల్యేలు - గవర్నర్ కోటాలో వీరి ఎంపిక జరగనుంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక పూర్తి చేసారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఖాయంగా చేసారు. ఎంతో కాలంగా ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూస్తున్న మర్రి రాజశేఖర్ కు ఈ సారి పదవి దక్కింది. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిన బీసీ వర్గానికి చెందిన చంద్రగిరి యేసురత్నంను ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట.. గుంటూరు పశ్చిమం నుంచి ఈ ఇద్దరికి అవకాశం లేదు. ఈ కారణంతోనే ముందుగానే ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఖరారు చేసారు.

డొక్కాకు ఎమ్మెల్యే గా అవకాశం
ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత డొక్కాకు ఎమ్మెల్సీ రెన్యువల్ ఖాయమని ప్రచారం సాగింది. కానీ, ఆయనకు అవకాశం దక్కలేదు. టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిన వెంటనే డొక్కాకు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. కానీ, ఇప్పుడు రెన్యువల్ చేయకపోవటంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. డొక్క గతంలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు రాజధాని నియోజకవర్గం తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేసారు. టీడీపీలో చేరిన తరువాత 2019 ఎన్నికల్లో అదే జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి..మాజీ హోం మంత్రి సుచరిత మీద ఓడిపోయారు. ఇప్పుడు అందులో తాడికొండ సీటు పైన కొంత కాలంగా చర్చ సాగుతోంది. అక్కడ సమన్వయక్తగా తొలుత డొక్కాను నియమించారు.

నియోజకవర్గం పైన చర్చ
కొద్ది రోజులగా క్రితం కత్తెర సురేష్ కుమార్ కు ఆదనపు సమన్వయకర్తగా నియమితులయ్యారు. దీంతో..వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శ్రీదేవికి పోటీ చేస్తారా లేదా అనేది జిల్లాలో చర్చకు కారణవవుతోంది. ఇప్పుడు డొక్కాకు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయకపోవటంతో...ఆయన వచ్చే ఎన్నికల్లో తాడికొండ సీటు నుంచి బరిలో నిలుస్తారా అనేది మరో ఆసక్తి కర చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం మేకతోటి సుచరిత పార్టీ పైన మనస్థాపంతో ఉన్నారనే ప్రచారం సాగింది. దీని పైన సుచరిత క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని సుచరిత స్పష్టం చేసారు. ఇప్పుడు డొక్కాకు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయకపోవటం.. గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలలో చర్చకు దారి తీస్తోంది. మరి..ఈ నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం ఎటా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications