రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తాం - సీఎం జగన్..!!

దేశ చర్రితలోనే మన ఆప్కాబ్‌కు మంచి గుర్తింపు ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామ‌ని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. సహకార వ్యవస్థను వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి​ బలోపేతం చేశార‌ని కొనియాడారు. ఆప్కాబ్‌లో వైయ‌స్ఆర్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. రైతులకు అందిస్తున్న సేవలను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఆప్కాబ్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్‌ కృషి చేస్తోంది. ఆప్కాబ్‌ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిదని ప్రశంసించారు. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వివరించారు.

jagan35

ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైంది. రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. సహకార వ్యవస్థను వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి​ బలోపేతం చేశార‌ని కొనియాడారు. ఆప్కాబ్‌లో వైయ‌స్ఆర్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆప్కాబ్‌ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రైతులకు ఆప్కాబ్‌ వెన్నుదన్నుగా నిలిచింద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌సంసించారు. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాయన్నారు. డిజిటిలైజేషన్‌తో సేవలు మరింత వేగం అందుకున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఆర్‌బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందననారు. ఆర్‌బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిస్తున్నాయన్నారు. ఆర్‌బీకేలను ఆప్కాబ్‌తో అనుసంధానం చేశామని వివరించారు. దేశ చర్రితలోనే మన ఆప్కాబ్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామ‌ని సీఎం వైయ‌స్‌ జగన్‌ చెప్పారు. 1963లో ప్రారంభమైన ఆప్కాబ్‌.. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి పనిచేస్తోందన్నారు. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయన్నారు. వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించిందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+