వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ దావోస్ టూర్ సక్సెస్-పెట్టుబడుల విమర్శలకు చెక్-రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులివే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్ టూర్ విజయవంతమైంది. పది రోజుల పాటు దావోస్ లో పర్యటించిన సీఎం జగన్ భారత్ కు చెందిన పలువురు పెట్టుబడిదారులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు విప్లవాత్మకమైన నిర్ణయాలను ఏకరువు పెట్టారు. దీంతో పెట్టుబడుల విషయంలో ఇప్పటివరకూ ఎదుర్కొంటున్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.

జగన్ దావోస్ టూర్ సక్సెస్

జగన్ దావోస్ టూర్ సక్సెస్

సీఎం జగన్ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఇందులో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీతో పాటు మిట్టల్, గ్రీన్ కో, అరబిందో సంస్ధలతో భారీ ఒప్పందాలు కుదిరాయి. వీటిలో అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌-డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందంతో పాటు కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు అడుగులు పడ్డాయి. అలాగే భారీగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేపట్టేందుకు వీలు కలగనుంది. తొలిసారిగా ఏపీలో ఆర్సెలర్‌ మిట్టల్‌ సంస్ధ పెట్టుబడులు పెడుతోంది.

ఏపీకి పెట్టుబడులివే

ఏపీకి పెట్టుబడులివే

జగన్ దావోస్ టూర్ వో అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో రూ.1.25 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఎస్‌ఈజెడ్‌ తో పాటు హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖను చేసేందుకు వీలుగా పలు ఒప్పందాలు కుదిరాయి. వీటితో యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖ నిలవబోతోంది. అలాగే దావోస్‌వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో ప్రగతివాణిని వినిపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. నాలుగోతరం పారిశ్రామికీకరణకు మూలకేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించే రూ.1,25,000 కోట్ల పెట్టబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదర్చుకుంది. పంప్‌డ్డ్‌ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రాబోతోంది.

దావోస్ లో సానుకూల ఫలితాలు

దావోస్ లో సానుకూల ఫలితాలు

గ్రీన్‌కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్టు ప్రసిద్ధ కంపెనీ ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని మిట్టల్ ప్రశంసించారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజీంగ్‌ తదితర రంగాల్లో ఉన్న ఆర్సెలర్‌మిట్టల్‌ గ్రూపుకు వార్షిక ఆదాయం76.571 బిలియన్‌ డాలర్లు. ఈ కంపెనీ రాష్ట్రంలోకి అందులోనూ తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీకి వేదికగా చేసుకుంది. కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మెనియా ఉత్పత్తుల పైనా దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్‌ సీఈఓ కితాబిచ్చారు.గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్‌ఈజెడ్‌ను తీసుకురానుండడం దావోస్‌ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్దతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈజోన్‌ను అభివృద్ధిచేస్తారు.

విశాఖపై ఫోకస్

విశాఖపై ఫోకస్

విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్‌ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత వెల్లడించారు. ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్‌ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్‌ ప్రకటించింది.
పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్‌ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ ప్రకటించింది. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్‌ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు.

English summary
ap cm ys jagan has returned from davos tour today. jagan has successfully pulled investments in his tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X