చంద్రబాబు అడ్డంగా దొరికారు, జరిగేదిదే- సీఎం జగన్ సంచలనం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ముఖ్యమంత్రి జగన్ తొలి సారిగా స్పందించారు. కేసులో ఏం జరిగిందో వివరించారు. చంద్రబాబు అడ్డంగా దొరికారని చెప్పుకొచ్చారు. పూర్తి సాక్ష్యాలు..ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేస్తే న్యాయస్థానం రిమాండ్ విధించిందని చెప్పుకొచ్చారు. అవినీతి చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన వారు ములాఖత్ పేరుతో మిలాఖత్ అయ్యారని పవన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేసారు. తప్పు చేసిన చంద్రబాబు ను కాకుండా ఎవరిని అరెస్ట్ చేయాలని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్ట్ పై సీఎం : ముఖ్యమంత్రి జగన్ నిడుదవోలులో కాపు నేస్తం నిధులను విడుదల చేసారు. ఇక, చంద్రబాబు స్కిల్ స్కాం గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపులను మంజునాధ కమిషన్ పేరుతో మోసం చేసిన చంద్రబాబు.. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఇవ్వటం సాధ్యం కాదని తెలిసి మరో మోసానికి తెర తీసారని జగన్ చెప్పుకొచ్చారు.

CM Jagan Reveals Chandra Babu Skill scam Case details, Fires on TDP Supporters

చంద్రబాబు లాగా తాను మోసం చేయనని..తనకు అబద్దాలు చేతకాదని పేర్కొన్నారు. నాడు ఇచ్చిన హామీ కంటే మెరుగ్గా నాలుగేళ్ల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ కాపుల కోసం 39,247 కోట్లు ఖర్చ చేసామని చెప్పారు. కాపు నేస్తంలో 4 లక్షల మంది మహిళలకు లబ్ది కలుగుతోందన్నారు. చంద్రబాబు తన జీవితమంతా సామాజిక వర్గాలను వంచించారని ఆరోపించారు. 45 ఏళ్లుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొన్నారని మండిపడ్డారు.

సాక్ష్యాలు..ఆధారాలతో : చంద్రబాబు అవినీతి కేసులో సాక్ష్యాలు..ఆధారాలతో అరెస్ట్ అయ్యారని జగన్ చెప్పారు. చంద్రబాబు రక్షించుకొనేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు కానీ, చట్టం ఎవరికి అయినా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంత కాలం లేరన్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని జగన్ స్పష్టం చేసారు.ఒక సాధారణ వ్యక్తి తప్పు చేస్తే ఎలా శిక్ష పడితే..అధికారంలో ఉన్న వారు చేసినా అదే శిక్ష పడాలని చెప్పేవారే ఇంత కాలం లేరన్నారు.

ఇప్పుడు ఆ గళం వినిపిస్తుంటే..ఈ ముఠా సభ్యులు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు దొంగగా దొరికినా కూడా అడ్డంగా, నిలువుగా దొరికినా కూడా ఆడియో, వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ దొరికినా కూడా ఆ వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ సర్టిఫికెట్లు ఇచ్చినా ..బాబు చేసింది అసలు నేరమే కాదని..వాదించటానికి పది కోట్ల ప్రజలకు కళ్లకు గంతలు కట్టటానికి వాటా దారులు ప్రయత్నాలు చేసారని చెప్పుకొచ్చారు.

CM Jagan Reveals Chandra Babu Skill scam Case details, Fires on TDP Supporters

నిజాన్ని చెప్పలేరు : నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి వీళ్లు రెడీగా లేరన్నారు. వీరంతా బాబు దొంగతనాల్లో వాటాదారులుగా అభివర్ణించారు. ఇంత అడ్డంగా దొరికినా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడని పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక ఫేక్ అగ్రిమెంట్ తయారు చేసి..లేని కంపెనీ ఉన్నట్లుగా చూపించి..ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి సాక్షాత్తు చంద్రబాబు పక్కన పెట్టించినా..ఆ సీమన్స్ కంపెనీనే మాకు రూ 371 కోట్లు డబ్బు ముట్టలేదని..ఆ అగ్రిమెంట్ తో సంబంధం లేదని చెప్పినా ఇలాగే వాదన చేస్తున్నారన్నారు.

సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ స్కిల్ స్కాంలో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని వివరించారు. స్కిల్ స్కాం సూత్రధారి చంద్రబాబు అని చెప్పి సాక్ష్యాలు...ఆధారాలు నోట్ ఫైల్స్ ఉన్నా.. అధికారులు డబ్బులు ఇవ్వద్దని చెప్పినా..ఏకంగా 13 సందర్భాల్లో ఒత్తిడి చేసి సంతకాలు పెట్టి సీఐడీ వారు ఇవన్నీ చూపించినా..అడ్డంగా వాదన చేస్తున్నారని మండిపడ్డారు.

CM Jagan Reveals Chandra Babu Skill scam Case details, Fires on TDP Supporters

కేంద్ర సంస్థలే తేల్చాయి : ఆ డబ్బును దొంగ సూటికేసుల కంపెనీలకు ఎలా మళ్లించారో ఈడీ అరెస్ట్ చేసారన్నారు. సాక్షాత్తు చంద్రబాబు పీఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డంగా సెల్ ఫోన్లలో ఛాటింగ్, ఈ మెయిల్స్ తో దొరికిపోయి ఐటీ ఈ పీఏ స్టేట్ మెంట్ ఇచ్చారని సీఎం జగన్ చెప్పారు. దీనిని ఐటీ అధికారులు నిర్ధారిస్తున్నా...ఏకంగా బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి..చివరకు కోర్టుల్లో పది గంటల పాటు ఇరు వైపులా వాదనాలు జరిగిన తరువాత..సాక్షాలు..

ఆధారాలు చూసిన తరువాత కోర్టు చంద్రబాబును రిమాండ్ కు పంపితే, ఇంత అడ్డగోలుగా దొరికినా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడని జగన్ పేర్కొన్నారు. నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్ లో మిలాఖత్ చేసుకొని పొత్తు పెట్టుకొనే వాడు మరొకడంటూ మండిపడ్డారు. జరిగేది కురుక్షేత్ర యుద్దంగా పేర్కొన్న జగన్..మీ ఇంటిలో మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలని..మంచి జరిగితేనే తనకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+