ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో కొంత డైలమా పరిస్థితి కనిపిస్తోంది. జనసేనాని పవన్ తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణ దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి తాజాగా విశాఖ కేంద్రంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పరిపాలనకు సంబంధించి ఆసక్తి కర ప్రకటన చేసారు.

విశాఖ కేంద్రంగా సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనలో ఉన్నారు. విశాఖ ఐటీహిల్‌ నంబర్‌2 వద్ద నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని పరిశీలించి.. ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించారు. పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలో ఫార్మా యూనిట్లను ప్రారంభించనున్నారు.

CM Jagan stated will begin Administration from Vizag before December, inaguarates Infosys office

హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరంగా పేర్కొన్నారు. ఇన్ఫోసి కంపెనీ అడుగు పెట్టడంతో ఏపి ఐటి భవిష్యత్తుకు ఒక మంచి సంకేతమన్నారు. మరిన్ని ప్రఖ్యాత ఐటి కంపెనీలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ నుంచే మొత్తం పాలన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కలలను సాకారం చేసుకోడానికి విశాఖపట్నం ఒక గమ్యస్ధానమని వివరించారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారైందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తాని ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో విశాఖ నుంచి పాలన పైన సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవబోతున్నట్లు సీఎం వెల్లడించారు.

సీఎం జగన్ ప్రకటన
డిసెంబర్లోగా తాను విశాఖకు షిఫ్ట్ అవబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుంది... ఇక్కడి నుంచే పాలన సాగుతుందని కీలక ప్రకటన చేసారు. 8 వర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని వివరించారు. ఏటా 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోందని సీఎం పేర్కొన్నారు.

ఇప్పటికే విశాఖలో పరిపాలనా.. కార్యాలయల గురించి అధికారుల కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ క్షేత్ర స్థాయిలో ఈ రోజు నుంచి అధ్యయనం ప్రారంభించింది. తొలుత దసరా నుంచే పాలన ప్రారంభించాలని భావించినా..కమిటీ నివేదిక తరువాతనే విశాఖకు తరలి వెళ్లాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు సీఎం చేసిన తాజా ప్రకటన రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+