వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

OTS పై సీఎం సమీక్ష; ప్రతిపక్షాల విమర్శలపై సీఎం జగన్‌ కౌంటర్ ఎటాక్

|
Google Oneindia TeluguNews

ఓటీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది. వైసీపీని వన్ టైం సెటిల్మెంట్ ఎందుకు కట్టాలంటూ నిలదీస్తుంది. అంతేకాదు ప్రజలకు కూడా ఓటీఎస్ కట్టొద్దని సూచనలు చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉచితంగా గృహాలు రిజిస్ట్రేషన్ లు చేయిస్తామని తేల్చి చెప్తుంది.

ఇక ఈ క్రమంలో టీడీపీతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్న సీఎం జగన్ ఓటీఎస్ పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఓటీఎస్ పూర్తిగా స్వచ్చందం అని, ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పదివేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని వెల్లడించారు. క్లియర్ టైటిల్ తో రిజిస్ట్రేషన్ జరుగుతుందని వెల్లడించారు. 10 వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని వెల్లడించారు. వారి రుణాలు మాఫీ చేస్తున్నామని,రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నామని పేర్కొన్నారు.

CM review on OTS; CM Jagan counter-attack on opposition criticism

వారికి సంపూర్ణ హక్కులు వస్తాయని వెల్లడించారు. ప్రజలు గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. కావాలని ఓటీఎస్ పథకం అమలు కాకుండా చాలా మంది చాలా రకాల సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వడ్డీ మాఫీ ప్రతిపాదనలు గత ప్రభుత్వం పరిశీలించలేదని పేర్కొన్న జగన్ సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కడితేనే బీ ఫారం పట్టా మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది పేదలకు మంచి అవకాశం అని పేర్కొన్న ఆయన ఆ అవకాశాలను వాడుకోవాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం అని పేర్కొన్నారు. డిసెంబర్ 21 నుండి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వటం మొదలుపెట్టండి అని ఆదేశించారు.
భవిష్యత్ లో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు కూడా జరుగుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. నిరుపేదలకు గృహాలపై హక్కు కల్పిస్తే అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుంటే కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

English summary
AP CM Jagan Mohan Reddy gave a reverse counter to the criticism of the Opposition along with the TDP. Saying that we are giving better opportunity to the poor, CM Jagan said in a review meeting on the OTS scheme that OTS is completely voluntary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X