సీఎం జగన్ పుట్టినరోజు ఈ ఏడాది సో స్పెషల్.. ప్రత్యేక వెబ్‌సైట్.. కొనసాగుతున్న సంబరాలు!!
ఏ పార్టీ అధినేత పుట్టినరోజు అయినా, లేదా ముఖ్యమంత్రి పుట్టినరోజు అయినా ప్రత్యేకంగా పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. అయితే పుట్టినరోజు నాడే వివిధ కార్యక్రమాలను చేపట్టి తమ అభిమాన నేత పై ఉన్న ప్రేమను చాటుకుంటారు. కానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు విషయంలో ఈసారి చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జగన్ బర్త్ డే స్పెషల్.. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు
ఇప్పటికే జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారిగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ని మంత్రి రోజా స్వయంగా దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. వివిధ కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. దీని కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించిన మరీ వేడుకలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఈనెల 21వ తేదీన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఏపీ లోని ముఖ్య నేతలు.

జగన్ జన్మదినం సందర్భంగా రక్తదానం చెయ్యటానికి ప్రత్యేక వెబ్ సైట్
జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్త దానం చేయడం కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను రూపకల్పన చేసి దానిని ఆవిష్కరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందులో పేరు నమోదు చేసుకుంటే ఎవరికైనా అవసరమైనప్పుడు రక్తదానం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈసారి జగన్ పుట్టినరోజు సందర్భంగా రికార్డ్ బ్రేక్ చేసే విధంగా రక్తదానం చేయాలని, గతంలో పార్టీ కార్యకర్తలు 38 వేల యూనిట్ల రక్తం దానం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈసారి వైయస్సార్ సిపి బ్లడ్ డొనేషన్ డాట్ కామ్ పేరుతో వెబ్సైట్ ప్రారంభించామని పేర్కొన్న ఆయన అవసరమైనప్పుడల్లా రక్తదానం చేసే అవకాశం ఈ వెబ్ సైట్ ద్వారా ఉంటుందని తెలిపారు.

జగన్ పుట్టిన రోజుకు ముందు నుండే హడావిడి.. వివిధ కార్యక్రమాలు
ఇక ఈసారి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల అంతా పాల్గొంటారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 21వ తేదీన జగన్ జన్మదినం సందర్భంగా ముందు నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 20వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు, 21వ తేదీన సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జగన్ పుట్టిన రోజు స్పెషల్ గా 10 రూపాయలకే ఈ పోస్ట్ కార్డ్
వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజును అత్యంత ఘనంగా నిర్వహించాలని భావించిన నేపథ్యంలోనే పార్టీ నాయకులు రకరకాల సన్నాహాల్లో ఉన్నారు. ఇక ఈ సారి జగన్ జన్మదినం సందర్భంగా తపాల శాఖ కూడా కేవలం పది రూపాయలు చెల్లిస్తే నేరుగా జగన్ కి శుభాకాంక్షలు పంపే ఈ పోస్ట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21వ తేదీన అందుబాటులో ఉంటుందని కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ ఒక కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అనేక భారీ కార్యక్రమాలతో మోత మోగనుంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications