రెండో విడత... నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్...

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా వారికి చేయూతను అందిస్తున్నారు. 'వైఎస్సార్ నేతన్న నేస్తం' కూడా అలాంటి పథకమే. డిసెంబరు 21, 2019న‌ దీన్ని ప్రారంభించిన సీఎం జగన్... ఆర్నెళ్ల వ్యవధిలో రెండో విడత సాయం అందించేందుకు సిద్దమయ్యారు.

శనివారం(జూన్ 20) 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకం కింద మగ్గం ఉన్న ప్రతీ నేతన్న ఖాతాలో రూ.24వేలు జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా సీఎం జగన్ దీన్ని ప్రారంభిస్తారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడుతారు. వారి సమస్యలు,ఆదాయం ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఈ పథకం కోసం మొత్తం రూ.194.46 కోట్లు ఖర్చు చేయనున్నారు.

cm ys jagan to launch ysr nethanna nestham scheme today

Recommended Video

    Lockdown In AP : Ongole లో ఎల్లుండి నుంచి 14 రోజులు Lockdown అమలు !

    రాష్ట్రంలో మొత్తం 81024 మంది చేనేత కార్మికులకు దీని ద్వారా లబ్ది చేకూరనుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆర్నెళ్లు ముందుగానే నేతన్నలకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపుతో పాటు, కోవిడ్‌ మాస్కులు తయారు చేసిన ఆప్కో సంస్థకు రూ.109 కోట్లు చెల్లించనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+