వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్లలో రెండోసారి: ఆ అస్త్రంతో.. అఖిల వ్యూహాలు!, ఇద్దరి భవిష్యత్తుపై..

నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి వ్యూహాలకు పదును పెడుతోంది. ఉప ఎన్నికల బాధ్యతను జిల్లా మంత్రులతో పాటు మరో నలుగురు మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించారు

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి వ్యూహాలకు పదును పెడుతోంది. ఉప ఎన్నికల బాధ్యతను జిల్లా మంత్రులతో పాటు మరో నలుగురు మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించారు.

చదవండి: తెరపైకి చెల్లి, ఫ్యామిలీలో విభేదాలు..: అఖిలప్రియ షాకింగ్, వేలు జగన్ వైపా?

కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలకు బాధ్యతలను అప్పగించారు. సోమవారం కేఈ కృష్ణమూర్తి కార్యాలయంలో మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి భేటీ అయి, చేసిన అభివృద్ధి పనులపై చర్చించారు.

చదవండి: చంద్రబాబు అసహనం, జగన్‌కు 2 కారణాలు: అఖిలప్రియ ట్విస్ట్

ఇతర ప్రతిపాదనలపై చర్చించారు. శాఖలవారీగా వాటికి వెంటనే అనుమతులు తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కలిసి పని చేస్తే గెలుపు ఖాయమని చెప్పారు. నంద్యాలలో చేపట్టాల్సిన పనుల గురించే చర్చ జరిగింది. వాటికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది.

మూడేళ్లలో రెండోసారి ఢీ

మూడేళ్లలో రెండోసారి ఢీ

నంద్యాల టిడిపి అభ్యర్ధిగా భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసిపి అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగి ప్రచారాన్ని వేగం చేశారు. ఇరుపార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు. నోటిఫికేషన్ వెలువడే నాటికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి. అభ్యర్థులు ఎందరు ఉన్నా పోటీ మాత్రం భూమా, శిల్పాల మధ్యే ఉంటుంది. మూడేళ్ల వ్యవధిలో భూమా, శిల్పా కుటుంబాల మధ్య రెండోసారి జరుగుతున్న పొలిటికల్ ఫైట్. అయితే, ఇరువురి నేతలు పరస్పరం పార్టీలు మార్చుకోవడం గమనార్హం.

మరింత వేడెక్కిన నంద్యాల

మరింత వేడెక్కిన నంద్యాల

నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అఖిలప్రియ సహా టిడిపి నేతలు ప్రయత్నించారు. కానీ వైసిపి అధినేత జగన్ మాత్రం అసలు ఆ ఆలోచనననే దగ్గరకు రానివ్వలేదు. భూమా నాగిరెడ్డి కుమారుడినో లేక కుమార్తెనో పోటీలో నిలబెట్టి ఉంటే సంప్రదాయాన్ని పాటించే వాళ్లమని, కానీ టిడిపి భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డిని బరిలోకి దించడం వల్ల గత సంప్రదాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వైసిపి చెబుతోంది. బ్రహ్మానంద రెడ్డి రేసులోకి రావడం వల్లనే జగన్ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించారని వైసిపి చెబుతుండటం గమనార్హం. కానీ అంతకుముందే పోటీ చేస్తామని జగన్ ప్రకటించారు. బ్రహ్మానంద రెడ్డి, శిల్పాలు పోటీ పడుతుండటంతో రాజకీయం మరింత వేడెక్కింది.

భూమా నాగిరెడ్డి సెంటిమెంటుతో కొట్టేందుకు.. అఖిల పావులు

భూమా నాగిరెడ్డి సెంటిమెంటుతో కొట్టేందుకు.. అఖిల పావులు

మంత్రి భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డిలు రాజకీయాలకు కొత్త కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అన్నా చెల్లెళ్లకు పలువురు మంత్రులు, ఇతర సీనియర్ నేతలను అండగా ఉంచారు. ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసి నంద్యాలలో గెలుపునకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో శోభా నాగి రెడ్డి సెంటిమెంట్ కారణంగా భూమా నాగిరెడ్డిపై శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి కూడా తన బాబాయ్ భూమా నాగిరెడ్డి సెంటిమెంటునే ప్రధానాస్త్రంగా చేసుకుని శిల్పాపై ప్రయోగిస్తున్నారు. భూమా సెంటిమెంటుపైనే వారి ఫ్యామిలీ బోలెడు ఆశలు పెట్టుకుంది. సానుభూతి పవనాలు తన బ్రహ్మానంద రెడ్డి వైపు వీచేలా చేయడం కోసం అఖిలప్రియ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

అఖిల, శిల్పాల రాజకీయ భవిష్యత్తుపై నంద్యాల ప్రభావం

అఖిల, శిల్పాల రాజకీయ భవిష్యత్తుపై నంద్యాల ప్రభావం

గెలుపుపై అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వం కూడా సాగింది. త్వరలో జరుగనున్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితం మంత్రి భూమా అఖిలప్రియ, మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.

English summary
With by-election to the Nandyal Assembly constituency becoming a prestige issue for the Telugu Desam Party, Chief Minister Chandrababu Naidu appointed Union Minister YS. Chowdary and Ministers P. Narayana and Kalava Srinivasulu as in-charges to work out a strategy that would ensure victory for the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X