హోదా ఉద్యమం: తల్లిదండ్రులకు హెచ్చరికలు.. 'మీ పిల్లలను వెళ్లనివ్వకండి'
హోదా కోసం నిరసన నేపథ్యంలో యూనివర్సిటీలు, కళాశాలలను పోలీస్ శాఖ ముందస్తుగా అప్రమత్తం చేసింది.
విశాఖపట్నం: జల్లికట్టు స్పూర్తితో రగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమంపై పోలీసు అణిచివేత కొనసాగుతోంది. 144సెక్షన్ తో ఎక్కడిక్కడ నిర్బంధాలు కొనసాగుతుండటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఆర్కే బీచ్ వేదికగా యువత చేపట్టిన ఈ మౌనదీక్షను అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం ముందు నుంచే పకడ్బంధీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
హోదా కోసం నిరసన నేపథ్యంలో యూనివర్సిటీలు, కళాశాలలను పోలీస్ శాఖ ముందస్తుగా అప్రమత్తం చేసింది. విద్యార్థులకు తల్లిదండ్రులకు సైతం వాట్సాప్ ద్వారా సందేశాలు చేరవేసింది. విద్యార్థులను నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా చూడాల్సిందిగా యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించింది.

దీంతో ఆందోళనల్లో పాల్గొనాలని వస్తోన్న సందేశాల నుంచి మీ పిల్లలను అప్రమత్తంగా ఉంచండి, అలాంటి నాన్ ఎకడమిక్ విషయాలకు మీ పిల్లలను దూరం జరపండి అంటూ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యాలు మేసేజ్ లు చేరవేస్తున్నాయి. హోదా ఆందోళనల్లో మీ పిల్లలు పాల్గొంటే అవాంఛనీయ పరిణామాలు జరగవచ్చునని మెసేజ్ ల ద్వారా పోలీసుల వారిని హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయానికి సంబంధించి.. మీ పిల్లలను ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంచాలంటూ గీతం యూనివర్సిటీ రిజిస్ట్రార్ పంపించిన సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications