సీఎం జగన్ పై కామెంట్లు.. ఎన్నారై ‘యష్’అరెస్టు; టీడీపీ గగ్గోలు!!
ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ యశస్వి అలియాస్ యష్ పొద్దులూరిని ఏపీ సిఐడీ పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై ఏపీ సిఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
జగన్మోహన్ రెడ్డి పాలనపై నిత్యం విమర్శలు చేసే యష్ జగన్ ను ఉగ్రవాది తో పోల్చి, వారిలాగానే జగన్ ఆలోచనలు కూడా ఉంటాయంటూ ఉగ్రవాదులకు, జగన్ కు పెద్ద తేడాలేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. జగన్ తన తండ్రిని చంపి సీఎం అవ్వాలని భావించాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా ఆయన విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన క్రమంలో ఎయిర్ పోర్ట్ లో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు 41 ఏ క్రింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. జనవరి 11వ తేదీన విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కోరారు. యష్ అరెస్టుతో ఏపీలో తీవ్ర దుమారం రేగింది. ఆయన అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎస్ అరెస్ట్ ప్రజాస్వామికమని పేర్కొని అతన్ని అరెస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు . వెంటనే యష్ ను విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. యష్ అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
NRI యశస్వి బొద్దులూరినీ హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న పోలీసులు .. #WeStandWithYash pic.twitter.com/wn8y5pxJKF
— iTDP Official (@iTDP_Official) December 23, 2023
న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులని, ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలకు వేధింపులని అచ్చెన్న మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించడానికి యష్ ఇండియా వచ్చారని, ఈ సమయంలో అతని అరెస్టు చేయడం దారుణమన్నారు.
మా అమ్మ గారి ఆరోగ్యం బాగొకపోతే ఇండియా వచ్చాను.. మా ఇంటిని ధ్వంసం చేశారు.. మా కుటుంబంపై 5 సార్లు దాడులు చేశారు..
— iTDP Official (@iTDP_Official) December 23, 2023
ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు - యశస్వి బొద్దులూరి.. #WeStandWithYash pic.twitter.com/4gRrkpjjy1
యష్ భద్రత విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని, అతని భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు, ఎన్నారై అరెస్టును, జగన్మోహన్ రెడ్డి తీరును ఖండించాలి అంటూ టిడిపి నేతలు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications