వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు మంత్రి పదవుల కోసం వైసీపీలో పోటీ: సీఎం జగన్ దృష్టిలో ఎవరున్నారో?

|
Google Oneindia TeluguNews

శాసన మండలి నుండి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మంత్రులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వటంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఈ రెండు మంత్రి పదవులకు వైసీపీలో తీవ్రమైన పోటీ వుంది. ఎవరికి వారు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవటానికి పాట్లు పడుతున్నారు. ఇక మంత్రులుగా సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారు ? జగన్ దృష్టిలో ఎవరున్నారు? అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా వైసీపీ కీలక నాయకుల్లోనూ జోరుగా చర్చ సాగుతుంది.

మంత్రిపదవుల కోసం సీఎం జగన్ వద్దకు ఆశావహులు

మంత్రిపదవుల కోసం సీఎం జగన్ వద్దకు ఆశావహులు


సీఎం జగన్ వద్ద , విజయసాయి రెడ్డి వద్ద చాలా మంద కీలక నేతలు, ఆశావహులు రెండు మంత్రి పదవుల కోసం ఇప్పటి నుంచే లాబీయింగ్ చేసుకుంటున్నారని సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ల నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. త్వరలోనే మండలి రద్దు కాబోతుండటంతో ఇక ఆ స్థానాలలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

గంపెడు ఆశలు పెట్టుకున్న రోజా ... మలి విడతలో అయినా అవకాశం వస్తుందా ?

గంపెడు ఆశలు పెట్టుకున్న రోజా ... మలి విడతలో అయినా అవకాశం వస్తుందా ?

గత ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తరువాత మంత్రి వర్గంలో స్థానం లభిస్తుంది అని మొదటిగా వినిపించిన పేరు రోజా.అప్పుడు రోజా తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ సామాజిక సమీకరణాల నేపధ్యంలో ఆమెకు సీఎం జగన్ మంత్రిగా అవకాశం ఇవ్వలేకపోయారు.రోజాను బుజ్జగించి ఆమెకు ఏపీఐఐసి చైర్మన్ పదవిని ఇచ్చారు. అయినప్పటికీ రోజా తను మంత్రి కావాలనే తన మనసులోని మాటను పలుమార్లు బయట పెట్టారు. ఇక ఈ నేపధ్యంలో మలివిడత మంత్రివర్గ విస్తరణలో రోజాకు పదవి ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. రోజా కూడా మంత్రి పదవి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు . మరి జగన్ దృష్టిలో రోజా ఉన్నారా?లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ఆశావహుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఆశావహుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఇక అంతేకాకుండా రోజాతో పాటుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంత్రిగా వాకాశం కోసం ఎదురు చూస్తున్నారు. లోకేష్ ను ఎన్నికల్లో ఓడించిన ఆయనకు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ అవకాశం రాలేదు. మరి ఇప్పుడు అయినా ఆయనకు మంత్రిగా అవకాశం ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఇక వీరితో పాటుగా పార్ధసారధి, కోటం రెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు, అంబటి రాంబాబు తదితరులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరికీ మంత్రి పదవులు దక్కుతాయో వేచి చూడాలి.

Recommended Video

AP Assembly : AP Finance Minister Buggana Rajendranath Reddy Brief Explanation On Three Capitals !
తమ్మినేని సీతారాం కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం అని ప్రచారం

తమ్మినేని సీతారాం కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం అని ప్రచారం

ఇక అంతే కాదు మరోవైపు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం కు కూడా స్పీకర్ పదవి నుంచి తప్పించి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. సీఎం జగన్ ఈ రెండు మంత్రి పదవుల్లో ఇప్పటికే పదవులను ఆశించి ఆయన దృష్టిలో పడటానికి ప్రయత్నాలు చేస్తున్న వీరికి అవకాశం ఇస్తారా ? లేదా ఎవరూ ఊహించని వారిని తెరమీదకు తీసుకువస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Two ministers in Andhra Pradesh will be vacant after CM Jagan Mohan Reddy was given the chance to be members of the Rajya Sabha. The two ministers have a fierce contest in the YCP. to whom Jagan will give as ministers? Who's in the Jagan's view? Now that is a hot topic in AP politics, there is a lot of debate among YCP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X