పవన్ పై ఉదయ్ కిరణ్ ఫిర్యాదు : ఇక్కడ తిరస్కరించినందుకు, అక్కడ..
హైదరాబాద్ : తిరుపతి సభలో ప్రసంగం ద్వారా.. కుల మతాలను కించపరిచేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన ఫిర్యాదును తిరస్కరించడంతో.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లుగా తెలిపారు ఉదయ్ కిరణ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ తన ఫిర్యాదును స్వీకరించినట్లుగా ఉదయ్ కిరణ్ స్పష్టం చేశారు.

కుల మతాల పేరు చెబితే.. తనకు అరికాళ్ల నుంచి మంట పుడుతుందని పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పవన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కోరినట్లుగా ఉదయ్ కిరణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications