మైలవరంలో గెలుపెవరిది..ఆ పార్టీవైపే మొగ్గు..?
ఏపీలో కీలక ఘట్టం ముగిసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల కోసం నేతలందరూ కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వైసీపీకి గుడ్ చెప్పిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకుని మరీ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఇక వైసీపీ నుంచి బీసీ కులానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్ బరిలో దిగారు.వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో అని మైలవరం నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ అనంతరం వచ్చిన అంచనాలు ,విశ్లేషణలు చూసుకుంటే వసంత కృష్ణ ప్రసాద్ రెండోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేసిన కచ్చింతంగా విజయం సాధించేవారని టీడీపీ నేతలు చెప్పడం ఇక్కడ విశేషం.టీడీపీ క్యాడర్ అంతా కూడా వసంత గెలుపు కోసం కృషి చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో వసంత గెలుపు ఖాయమని ఆ పార్టీ చెబుతోంది.

అయితే వైసీపీ కూడా గెలుపు ఆశలను వదులుకోవడం లేదు. మహిళలు వృద్దులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వచ్చారని వారి ఓట్లు అన్నీ కూడా తమకే అని భావిస్తున్నారు.మైలవరంలో గౌడ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది. ఆ ఓటు బ్యాంకుపై వైసీపీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు బీసీ సామాజిక వర్గం కూడా తమకు కలసి వస్తుందని విశ్లేషించు కుంటున్నారు. రెడ్డిగూడెం, మైలవరం, జి. కొండురు మండలాలు వైసీపీకి అనుకూలంగా పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఇబ్రహింపట్నం, కొండపల్లి, గొల్లపూడి వంటి మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు వైసీపీకి మద్దతుగా ఉండగా, పట్టణ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపించారు. తటస్థ ఓటర్లు ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి అండగా ఉంటారో చూడాలి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications