Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్ధుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం-తొలిరోజు అప్లికేషన్లు ఇవే..!

ఏపీలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు పీసీసీ ఛీఫ్ గా కూడా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఓవైపు జిల్లాల పర్యటన చేపట్టగా.. మరోవైపు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఇలా ఔత్సాహిక అభ్యర్ధుల కోసం దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆ తర్వాత వడపోసి టికెట్లు ఖరారు చేస్తారు.

ఈ నెల 24 నుంచి కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టగానే ప్రారంభించారు. అనుకున్నట్లుగానే ఇవాళ విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ టికెట్ల కోసం దరఖాస్తుల్ని స్వీకరించడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

congress assembly candidates application process begins in ap- here are first-day applicants

తొలిరోజు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేతల్లో గుంటూరు ఈస్ట్ నుంచి మస్తాన్ వలీ, వైఎస్సార్ జిల్లా బద్వేలు నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, మడకశిర నుంచి కె సుధాకర్ పార్టీ అభ్యర్ధులుగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తోంది. వీరి నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ అప్లికేషన్లు స్వీకరించారు.

congress assembly candidates application process begins in ap- here are first-day applicants

ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామీక వాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందన్నారు. ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. క్యాష్ బేస్డ్ క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయబోదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపిలో పర్యటన చేస్తుందని, పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి ఉంటే చేయవచ్చని ఠాకూర్ సూచించారు. భావసారూప్య పార్టీలతో కలిసి అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్దంగా ఉందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదన్నారు. కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీలలో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు ఠాకూర్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+