అమిత్ షాకు దాన్నెందుకు గుర్తుచేస్తావ్ సామీ..! సాయిరెడ్డికి కాంగ్రెస్ పంచ్..!
కేంద్ర ప్రభుత్వం గత వారం లోక్ సభలో మహిళా బిల్లు కమ్ డీలిమిటేషన్ బిల్లు కలిపి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. అయితే దీనికి లోక్ సభలో విపక్షం సహకరించకపోవడంతో వీగిపోయింది. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ లభించకపోవడంతో కేంద్రం దాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ఎలా నెగ్గించుకోవాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాన (Amit Shah) కు వైసీపీ మాజీ ఎెంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఇవాళ ట్వీట్ చేశారు.
ఇందులో విజయసాయిరెడ్డి.. అమిత్ షాకు మూడు ఐడియాలు ఇచ్చారు. వాటిని అమలు చేస్తే విపక్షాల వ్యతిరేకత లేకుండా సదరు బిల్లును ఆమోదింపజేసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఇందులో బిల్లులో రాష్ట్రాల వారీగా సీట్లలో 50% పెరుగుదలను చూపే ఒక లిఖితపూర్వక షెడ్యూల్ ఉాండాలని, అలాగే మహిళలకు 33% రిజర్వేషన్‌తో రాజ్యసభ సీట్లను 50% విస్తరించాలని, దీంతో పాటు 1971 నాటి ప్రామాణికం ప్రకారం దక్షిణ భారతదేశ లోక్‌సభ వాటాను కొనసాగించడం చేయాలని సూచించారు.

Why expose failure of Amit Shah again?
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) April 21, 2026
When MPs of BabuPawanJagan (BJP)stood with Modi and Shah on the delimitation bill, they still couldn’t win public trust.
Why drag Shah again? Why this “kolaveri”?#DelimitationDisaster https://t.co/tuMNrORW5C
వీటిపై అమిత్ షా స్పందించకముందే కాంగ్రెస్ పార్టీ (congress) స్పందించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ (Manickam Tagore) ఇవాళ సాయిరెడ్డి ట్వీట్ ను కోట్ చేస్తూ పంచ్ లు వేశారు. అమిత్ షా వైఫల్యాన్ని మళ్ళీ ఎందుకు బయటపెడుతున్నారని ఆయన్ను ప్రశ్నించారు. డీలిమిటేషన్ బిల్లు విషయంలో బాబుపవన్జగన్ (బీజేపీ) ఎంపీలు మోదీ, షాలకు మద్దతుగా నిలిచినా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అలాగే అమిత్ షాను మళ్ళీ ఎందుకు లాగుతున్నారు? ఈ "కొలవెరి" ఎందుకు? అని మాణిక్కం ఠాకూర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications