ఆటంబాబులాంటి నిర్ణయం: విభజనపై పాలడుగు

తెలంగాణ కావాలని అక్కడి వారు చేసిన ఆందోళనలను గమనిస్తున్నాంగానీ ఆటంబాంబు వంటి నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటుందని ఊహించలేదన్నారు. దేశ చరిత్రలో ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడం కూడా ఆలోచించదగిన విషయమన్నారు.
పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించాలన్నారు. విభజనను ఆపటానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రపతి కూడా రాజ్యాంగానికి అనుకూలంగానడిచే వ్యక్తేనన్నారు.
తప్పు చేశామని ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటం దురదృష్టకరమన్నారు. బీజేపీ నేతలు నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు విమర్శలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. వారు మహాత్మాగాంధీ బొమ్మను ఎందుకు పెట్టుకోవటం లేదో చెప్పగలరా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications