చెప్పు దెబ్బలు తింటావ్ జగన్ మోహన్ రెడ్డి .. చెప్పు చూపించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ

రాజధాని గ్రామాల్లో రైతులు ఆందోళనలు ఆగటం లేదు. మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత 27వ తేదీన తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని పై వచ్చిన నివేదికలపై ఫైనల్ గా రిపోర్ట్ ఇచ్చేందుకు హై పవర్ కమిటీ ని నియమించారు. మంత్రి బుగ్గన నేతృత్వంలో ఈ హై పవర్ కమిటీ రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ పై తమ తుది నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రాజధాని అంశంపై తన తుది ప్రకటన చేస్తానని ప్రకటన వాయిదా వేసిన జగన్మోహన్ రెడ్డికి రాజధాని రైతుల సెగ తగులుతోంది. నివురుగప్పిన నిప్పులా రాజధాని గ్రామాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.

తుళ్లూరులో జరుగుతున్న నిరసన దీక్షలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుంకర పద్మశ్రీ

తుళ్లూరులో జరుగుతున్న నిరసన దీక్షలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుంకర పద్మశ్రీ

ఇక తాజాగా తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షకు మద్దతు తెలిపిన అమరావతి పరిరక్షణ సమితి సోషల్ కన్వీనర్ తుమ్మల కార్తీక్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తుళ్లూరులో జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొన్న సుంకర పద్మశ్రీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపించి మరీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

జగన్ లా జైలుకు వెళ్లి వచ్చామా ? అర్దరాత్రి అరెస్ట్ చెయ్యటానికి అని మండిపాటు

జగన్ లా జైలుకు వెళ్లి వచ్చామా ? అర్దరాత్రి అరెస్ట్ చెయ్యటానికి అని మండిపాటు

ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్న అంబటి రాంబాబు పిచ్చికుక్క అని సంబోధించారు. మనమేమైనా జగన్మోహన్ రెడ్డి లా జైలుకు వెళ్ళొచ్చామా అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ నిజంగా ఒక తల్లికి కొడుకైతే, ఒక్క చెల్లికి అన్న అయితే, ఒక భార్యకు భర్త అయితే ఇంత మంది మహిళలతో కన్నీరు పెట్టించరని మండిపడ్డారు సుంకర పద్మశ్రీ. . రాజధాని అమరావతి విషయంలో, రాజధాని మహిళల విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు దారుణమని ఆమె మండిపడ్డారు.

చెప్పు చూపిస్తూ చెప్పు దెబ్బలు తింటావని సీఎం జగన్ కు హెచ్చరిక

చెప్పు చూపిస్తూ చెప్పు దెబ్బలు తింటావని సీఎం జగన్ కు హెచ్చరిక

అంతేకాదు రాజధాని మహిళలకు డబ్బులు ఎక్కువై, ఇళ్ళల్లో పేకాట శిబిరాలు నడుపుతున్నారని, ఆ పేకాట శిబిరాలను జగన్మోహన్ రెడ్డి మూయించి వేశారు కాబట్టి ఇప్పుడు రాజధాని మహిళలు ఆందోళన చేస్తున్నారని అవాకులు చెవాకులు పేలుతున్నారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అందుకే మహిళలపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని, సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుదెబ్బలు తింటారు అని చెప్పు చూపిస్తూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డీజీపీ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు

డీజీపీ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు

ఇక అంతే కాదు జగన్మోహన్ రెడ్డి డిజిపి చెంచాగిరి చేస్తున్నారని, కేసులు పెట్టుకుంటే పెట్టుకోమని, ఇలాంటి బెదిరింపులు లెక్క చేయబోమని సుంకర పద్మశ్రీ తెలిపారు. ఖబర్దార్ జగన్ మోహన్ రెడ్డి మహిళల తో పెట్టుకోవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు . సీఎం జగన్ టార్గెట్ గా చెప్పుచూపిస్తూ సుంకర పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఏపీలో రాజకీయ దుమారం రేపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+