తెలంగాణ నుంచి హామీ ఇస్తున్నా!: ఏపీకి ప్రత్యేకహోదాపై సోనియా గాంధీ ప్రకటన
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తెలంగాణను ఏర్పాటు చేస్తూనే, ఏపీ ప్రజలు కూడా బాగుండాలని తాము నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో ప్రకటన చేశామని చెప్పారు.
ఏపీ ప్రజలకు తాను ఈ వేదిక నుంచి వాగ్ధానం చేస్తున్నానని, ఆనాడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ఏపీ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణలను బాగుండాలనేది తమ కోరిక అన్నారు.

ఏపీకి ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంగా ప్రత్యేక హోదా కూడా అన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. కానీ చట్టం చేయలేదు. దీంతో బీజేపీ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈసారి తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గత కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఇఫ్పుడు సోనియా కూడా చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పడం, దానికి తోడు కేంద్రంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం, బీజేపీయేతర పార్టీల ఏకీకరణ కోసం ప్రయత్నాలు చేస్తన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాహుల్ గాంధీతో చేతులు కలిపారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications