ఇక కఠినమే: కిరణ్ కదలికపై నేతల కన్ను, దాడికి సిద్ధం!

ఈ నేపథ్యంలో పార్టీలో ఉండేదెవరో, పోయేదెవరో తేల్చేయడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ నుంచి భారీగా వలసలు చోటుచేసుకుంటుండటం, విభజనకు కాంగ్రెస్‌ని ప్రధాన ముద్దాయిగా చూపి సీమాంధ్ర ప్రజలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
రాజకీయ పార్టీని స్థాపించే అంశమై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమవుతున్న నేపథ్యంలో మున్ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేదెవరో పార్టీని వీడెదెవరో తెలుసుకునేందుకు సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు.
మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి ఇప్పటికే ఈ బాధ్యతను తీసుకున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ జిల్లాల వారీగా పార్టీలో కొనసాగే వారెవరు అన్న సమాచారాన్ని ఇప్పటికే తెప్పించుకున్నారట. పార్టీని వీడి బయటకువెళ్లే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారట.
వేరే పార్టీలో కర్చీఫ్ వేసుకున్న పలువురు నేతలు.. కాంగ్రెసులో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారిని ఇక ఉపేక్షించవద్దనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు, కిరణ్ కదలికల పైన అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కన్నేసింది. ఇప్పటికే కిరణ్ పైన కొండ్రు, రఘువీరా రెడ్డి, బాలరాజు, డొక్కాలు మండిపడుతున్నారు. కిరణ్ పార్టీ పెడితే మరికొందరు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఆయనను టార్గెట్ చేసుకోనున్నారు.












Click it and Unblock the Notifications