నాపై కుట్ర, స్వామి సేవలోనే: డాలర్ శేషాద్రి

తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసు నుండి డాలర్ శేషాద్రి బయటపడిన విషయం తెలిసిందే. చిత్తూరు కోర్టు ఆయనను ఇటీవల ఈ కేసులో నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువు ఉన్న 300 బంగారం డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రిపై, ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశించింది.
సిబిసిఐడి విచారణ జరిపి తన నివేదికను 2008లో కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘ కాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టిటిడి షరాబు వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడ్డాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు మరో నలుగురికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారిగా డాలర్ శేషాద్రి నియామకాన్ని గతంలో పొడిగించారు. ఆయన పొడిగింపు పైన న్యాయస్థానంకు కూడా వెళ్లిన వారు ఉన్నారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం ఆయన నియామకాన్ని సమర్థించింది. తిరుమల ప్రత్యేకాధికారిగా ఉన్న ఆయనకు అక్టోబర్ నెల ఒకటో తేదిన గుండెపోటు కూడా వచ్చింది. దీంతో కొద్దిరోజులు స్వామి వారి సేవకు దూరంగా ఉన్నారు. పదిహేను రోజుల తర్వాత ఆయన మళ్లీ స్వామివారి సేవకు ఇటీవల హాజరయ్యారు.












Click it and Unblock the Notifications