ఇద్దరు పెళ్లాలు, మరో స్త్రీతో జీవనం: భక్తుడి ఆత్మహత్య

విశాఖపట్నం/ తిరుపతి: విశాఖపట్నం నగరంలో కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు పెళ్లిళ్ల వ్యవహారం బయటకు వచ్చింది. ఎస్‌ రాయవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మజ్జి నాగేశ్వరరావు ఇద్దరు మహిళలను మోసం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దాంతో ఆగకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

ఆ విషయం తెలుసుకున్న రెండో భార్య శ్రీదేవి కానిస్టేబుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నోసార్లు నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఉన్న అధికారి నాగేశ్వరరావుకు మద్దతుగా నిలిచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీదేవి తెలిపారు.

Constable wed two women at Visakhapatnam

గతంలో మోసపూరితంగా ఇద్దరు మహిళలు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు మరో మహిళతో సబంధం పెట్టుకున్న కానిస్టేబుల్‌ నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని ఉద్యోగం నుంచి తీసివేయాలని మహిళా నేత పద్మా డిమాండ్‌ చేశారు.

ఇదిలావుంటే, తిరుమలలో ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపవినాశనం సమీపంలో నందకం అతిథి గృహం దగ్గర టీటీడీ ఉచిత బస్సుకింద పడి భక్తుడు చనిపోయాడు. బస్సు వెనుక టైరు కింద భక్తుడు తల పెట్టడంతో ముఖం గుర్తించలేనంతగా దెబ్బ తింది. అయితే ఉదయం నుంచే అతడు పలు వాహనాల కింద పడి చనిపోయేందుకు ప్రయత్నించాడని నిఘా అధికారి ఒకరు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+