జగన్‌కు మంచి ఛాన్స్, తప్పే, బాబును ఎందుకు నిలదీయట్లేదు, తెలుసుకుంటా: పవన్ నిలదీత

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

పరకాలా! చిరు నోరులేనివాడు, ఆ రోజు నేనే ఉండిఉంటే, భార్యను కూర్చోబెట్టావ్: పవన్, జగన్‌పైనా

శుక్రవారం విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయనను కలిశారు. వారు తమ ఆవేదనను ఆయనకు చెప్పుకున్నారు. తొలుత ఫాతిమా కాలేజీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయనను కలిశారు.

 ఇదీ మా ఆవేదన

ఇదీ మా ఆవేదన

ఈ సందర్భంగా వారు తమ ఆవేదనను ఆయనకు చెప్పుకున్నారు. తాము రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమకు కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. 24వేల ఉద్యోగులను క్రమబద్దీకరించాలని వారు అన్నారు. ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలన్నారు.

 నేను విషయం తెలుసుకుంటా

నేను విషయం తెలుసుకుంటా

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాను శ్రమ దోపిడికీ వ్యతిరేకం అని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. సమస్య పరిష్కరానికి అవరోధం, అడ్డంకి ఏమిటో తాను తెలుసుకుంటానని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆయన హామీ ఇచ్చారు.

 ప్రతిపక్షం ఎందుకు పట్టించుకోవట్లేదు

ప్రతిపక్షం ఎందుకు పట్టించుకోవట్లేదు

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో చర్చించాలన్నారు. ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీయాలన్నారు. అసలు ప్రతిపక్షం మీ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని వారిని ప్రశ్నించారు.

 జగన్‌కు అవకాశం ఉంది!

జగన్‌కు అవకాశం ఉంది!

ఇలాంటి సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా నిలదీసే అవకాశం ప్రతిపక్షానికి ఉందని వైసీపీని ఉద్దేశించి అన్నారు. అయినా పట్టించుకోకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా ప్రశ్నించారు.

సమస్యలు చెప్తే పరిష్కరిస్తా, జగన్‌ది తప్పు

సమస్యలు చెప్తే పరిష్కరిస్తా, జగన్‌ది తప్పు

కష్టపడ్డ వారికి సమాన వేతనం ఉండాలని కోరకునే వాడిని తాను అని పవన్ చెప్పారు. అసెంబ్లీకి ప్రతిపక్షం హాజరు కాకపోవడం తప్పే అన్నారు. కార్మికుల చట్టాలను ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయన్నారు. సమస్యలు చెబితే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Contract employees meet Jana Sena cheif Pawan Kalyan in Vijayawada on friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X