సిక్కోల్లో పేలిన తుపాకీ: జవాను అనుమానాస్పద మృతి

Cop from Chhattisgarh Found Dead
శ్రీకాకుళం: పొరపాటున తుపాకీ పేలి ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు మృతి చెందారు. సాధారణ ఎన్నికల విధులకు ఈయన చత్తీస్‌గ‌డ్ నుంచి వచ్చారు. గురువారం రాత్రి తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల బందోబస్త్ కోసం చత్తీస్‌ఘడ్ నుంచి ఒక కంపెనీ ఏ ఆర్ కానిస్టేబుల్స్ శ్రీకాకుళం వచ్చారు. వీరికి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

బుధవారం ఎన్నికలు ముగియటంతో గురువారం రాత్రి తిరిగి వెళ్లి పోవాల్సి ఉంది. ఇంతలో మధ్యా హ్నం 2.30 సమయంలో వీరు బస చేసిన రూమ్‌లో పేలుడు శబ్ధం విన్పించింది. ఏమైందని అందరు కానిస్టేబుళ్లు పరుగులు పెట్టారు. తల నుంచి రక్తం కారుతూ పడి ఉన్న కానిస్టేబుల్ కనిపించడంతో సహచరులంతా నిర్ఘాంత పోయారు.

గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్ అనే కానిస్టేబుల్ తన తుపాకీని శుభ్రం చేస్తుండగా పొరపాటున పేలడంతో ఎదురుగా ఉన్న దినేష్ కుమార్‌ తలలోంచి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ఇది హత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

గోవింద్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూమ్‌లో ఉంటున్న సహచరులు ప్రమాదవశాత్తూ జరిగినట్టు చెపుతున్నారు. అయితే ఇద్దరు సహచరుల మధ్య చిన్నపాటి గొడవ ఏదో జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకవేళ క్షణికావేశంలో కాల్పులు జరిపాడా లేదా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

తోటి ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇది హత్యా, ప్రమాదవశాత్తు జరిగిందా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+